Belly Fat Drink : రోజూ ఉద‌యాన్నే ఇది తాగితే నెల రోజుల్లో మీ పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : మన‌లో చాలా మంది స్థూల‌కాయం, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. స్థూల‌కాయం, అధిక బ‌రువు, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఈ స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే గుండెపోటు, అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్ వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డం చాలా అవ‌స‌రం. చాలా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల అనారోగ్య ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. స‌రిగ్గా ఆహారాన్ని తీసుకోకుండా బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు.

దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఎటువంటి డైటింగ్ ప‌ద్దతులు పాటించ‌కుండా చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక పొట్ట‌ను, స్థూల‌కాయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. శ‌రీర బ‌రువును పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఆ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక పెద్ద ట‌మాటను, ఒక ఇంచు అల్లం ముక్క‌ను, అర టీ స్పూన్ మిరియాల పొడిని, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ట‌మాట‌కాయ‌ను ముక్క‌లుగా చేసుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా దంచాలి.ఇప్పుడు ఈ రెండింటిని ఒక జార్ లో వేసి ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

Belly Fat Drink take daily morning for effective results
Belly Fat Drink

త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే దీనిని తాగిన గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఈ విధంగా ఈ పానీయాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా రెండు నెల‌ల పాటు తీసుకోవాలి. దీనిని తీసుకోవ‌డం మొద‌లు పెట్టిన 15 రోజుల్లోనే మ‌నం మ‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే విధంగా ఈ పానీయాన్ని తీసుకుంటున్న స‌మ‌యంలో నీటిని ఎక్కువ‌గా తాగాలి. ప్ర‌తిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. ఈ విధంగా ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా, ఆరోగ్యవంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వును, శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

D

Recent Posts