Betel Leaves : తమలపాకులను సహజంగానే చాలా మంది తాంబూలం రూపంలో తీసుకుంటుంటారు. హిందువులు పలు పూజల్లో తమలపాకులను ఉపయోగిస్తుంటారు. అయితే నిజానికి ఆయుర్వేదం ప్రకారం తమలపాకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. అందువల్ల తమలపాకులతో వ్యాధులను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తమలపాకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తమలపాకుల రసం, తులసి ఆకుల రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి పిల్లలకు ఇస్తుండాలి. వారిలో వచ్చే జలుబు, దగ్గు తగ్గుతాయి.
2. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలొ చేరిన వాతం తగ్గి తలనొప్పి నుంచి ఉపమశనం లభిస్తుంది.
3. తమలపాకుల రసాన్ని కొద్దిగా తీసుకుని పాలలో కలిపి తీసుకోవాలి. మహిళల్లో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
4. తమలపాకుల రసాన్ని రెండు కళ్లలోనూ చుక్కలుగా రోజూ వేస్తుండాలి. రేచీకటి సమస్య తగ్గుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
5. తమలపాకుల రసాన్ని ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ చొప్పున తీసుకుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె అసాధారణ రీతిలో కాకుండా క్రమబద్దంగా కొట్టుకుంటుంది.
6. తమలపాకుల రసాన్ని టీస్పూన్ మోతాదులో ఉదయం, సాయంత్రం సేవిస్తుంటే శ్లేష్మం తగ్గుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. పసికందులకు పాలివ్వకపోతే కొందరు తల్లులకు రొమ్ముల్లో పాలు అలాగే ఉండి గడ్డలుగా మారి నొప్పిని కలగజేస్తాయి. అలాంటప్పుడు తమలపాకులను వేడి చేసి రొమ్ముల మీద వేసి కట్టుకోవాలి. నొప్పి, వాపులు తగ్గిపోతాయి.
8. భోజనం చేసిన అనంతరం రోజూ రాత్రి తమలపాకుల తాంబూలం తింటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలైన గ్యాస్, మలబద్దకం ఉండవు. అలాగే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీ, పురుషులకు శృంగారంపై ఆసక్తి కలుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు.