Black Chana Sprouts : భోజ‌నానికి ముందు వీటిని తినండి.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.. జ‌న్మ‌లో రాదు..

Black Chana Sprouts : మ‌న‌ల్ని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ స‌రైన ఆహార నియ‌మాలు, క్ర‌మం తప్ప‌ని వ్యాయామం, మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటే నియంత్ర‌ణ సాధ్య‌మ‌ని చెబుతున్నారు నిపుణులు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి మ‌న భ‌యాలు మ‌న‌కు ఉండ‌నే ఉంటాయి. అయితే ఈ షుగ‌ర్ వ్యాధిని శ‌న‌గ‌ల ద్వారా నియంత్రించ‌వ‌చ్చు. షుగ‌ర్ కు శ‌న‌గ‌ల‌కు సంబంధం ఏంట‌ని మ‌న‌లో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ భోజనానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధిని నియంత్రించుకోవ‌చ్చని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

శ‌న‌గ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. శుభ కార్యాల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. నాన‌బెట్టిన న‌ల్ల శ‌న‌గ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. తాజాగా న‌ల్ల శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌రో ఆరోగ్య ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను భోజ‌నానికి ముందు తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ త్వ‌రిత గ‌తిన జీర్ణం కాకుండా చేసి షుగ‌ర్ ను తగ్గిస్తుంద‌ని అనేక ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకున్న త‌రువాత ఒంట్లోని షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో శ‌న‌గ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయ‌ట‌.

Black Chana Sprouts can control blood sugar levels take before meals
Black Chana Sprouts

దాదాపు 50 గ్రాముల మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను భోజ‌నానికి ముందు తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఏయే మొల‌కెత్తిన విత్త‌నాలు మేలు చేస్తాయని జ‌రిపిన అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది. సాధార‌ణంగా ఈ మొల‌కెత్తిన గింజ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని అంద‌రికి తెలుసు. భోజ‌నానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గలు తింటే మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ విధంగా శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధి భ‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటుందని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

అయితే ప‌చ్చి శ‌న‌గ‌ల్ని నీటిలో నాన‌బెట్టి అవి మొల‌కెత్త‌గానే వాటికి ఏమి క‌ల‌ప‌కుండా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక వాటిని మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ త్వ‌ర‌గా శోషించుకోలేద‌ట‌. అంతేకాకుండా త్వ‌రిత‌గతిన జీర్ణ‌క్రియ సాగ‌డాన్ని నిరోధించే దీనిలోని అంశాలు కార్బోహైడ్రేట్ల‌ను వేగంగా శ‌రీరంలో శోష‌ణ కాకుండా చేస్తున్నాయ‌ట‌. అంటే శ‌న‌గ‌లు మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న వారికి బాధ‌ప‌డే అవ‌కాశం ఉన్న వారికి దివ్యౌష‌ధ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ విధంగా శ‌న‌గ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts