Black Grapes : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తీసుకోవడంతో పాటు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ద్రాక్ష పండ్లలల్లో వివిధ రకాలు ఉంటాయి. వాటిలో నల్ల ద్రాక్షలు కూడా ఒకటి. నల్ల ద్రాక్షలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే తెల్ల ద్రాక్షల వలె నల్ల ద్రాక్షలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నల్లద్రాక్షలను కూడా రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. నల్లద్రాక్షలో కూడా అనేక రకాల పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల ద్రాక్షలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లద్రాక్షలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే నల్లద్రాక్షలల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నిరోధించడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా నల్లద్రాక్షలను తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరిచేరకుండా ఉంటాయి. అదే విధంగా నల్లద్రాక్షలల్లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును పెంచి మెదడు చురుకుగా పని చేసేలా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ రెస్వెరాట్రాల్ రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో, గుండెపనితీరును పెంచడంలో కూడా దోహదపడుతుంది. అలాగే నల్లద్రాక్షలల్లో క్వెర్సెటిన్, ఆంథోసైనిస్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, ఫ్రీరాడికల్స్ ను నశింపజేయడంలో సహాయపడతాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో కూడా నల్ల ద్రాక్షలు మనకు సహాయపడతాయి. ఇక నల్లద్రాక్షలల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా నల్లద్రాక్షలల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నల్లద్రాక్షలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అలాగే నల్లద్రాక్షలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని మితంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందడంతో పాటు మనం హైడ్రేటెడ్ గా కూడా ఉండవచ్చు. ఈ విధంగా నల్ల ద్రాక్షలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.