Sajja Rotte : స‌జ్జ రొట్టెల‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Sajja Rotte : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా స‌జ్జలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స‌జ్జ‌ల‌తో ఎక్కువ‌గా అన్నం వండుకుని తింటారు. అలాగే వీటినిపిండిగా చేసి రొట్టెల‌ను కూడా త‌యారు చేసి తీసుకుంటారు. స‌జ్జ రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. వెజ్ మ‌రియు నాన్ వెజ్ క‌ర్రీల‌తో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ రొట్టెల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ స‌జ్జ రొట్టెలను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స‌జ్జ రొట్టెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, సొర‌కాయ తురుము – పావు క‌ప్పు, స‌జ్జ పిండి – ఒక క‌ప్పు.

Sajja Rotte recipe very tasty and healthy how to make them
Sajja Rotte

స‌జ్జ రొట్టెల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే సొర‌కాయ తురుము వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత స‌జ్జ పిండి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత పిండిని నొక్కుతూ 5 నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చేత్తో రొట్టెలాగా వ‌త్తుకోవాలి. చేత్తో చేయ‌డం రాని వారు చ‌పాతీ క‌ర్ర‌తో నెమ్మ‌దిగా వ‌త్తుతూ రొట్టెలాగా చేసుకోవాలి. త‌రువాత ఈ రొట్టెను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి. త‌రువాత మ‌రో వైపుకు తిప్పి నీటిని చ‌ల్లుకుని కాల్చుకోవాలి. రొట్టెను రెండు వైపులా పూర్తిగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ రొట్టె కాల‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాగే వీటిలో సొర‌కాయ తురుమును వేసుకోకుండా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌జ్జ రొట్టెలు త‌యార‌వుతాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts