అధిక బరువును తగ్గించుకోవాలని శరీరం తెలిపే సూచనలు ఇవే..!

అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం అనేక మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేయడం, యోగా వంటివి చేయడం పాటిస్తున్నారు. అయితే అధికంగా బరువు పెరుగుతుంటే శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అంటే.. బరువును తగ్గించుకోవాలని అర్థం అన్నమాట. మరి ఆ లక్షణాలు ఏమిటంటే…

body will show these symptoms if you have over weight

1. అధికంగా బరువు పెరిగే వారికి హైబీపీ వస్తుంది. బీపీ ఉన్నట్లుండి అధికమైతే అలాంటి వారు బరువు పెరుగుతున్నారో, లేదో చెక్‌ చేసుకోవాలి. బరువు పెరుగుతుంటే దాని వల్లే బీపీ పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. దీంతో బరువు తగ్గాల్సి ఉంటుంది. బరువును తగ్గించుకుంటే హైబీపీ కూడా తగ్గుతుంది. కనుక హైబీపీ సడెన్ గా వచ్చిన వారు అందుకు బరువు పెరగడమే కారణమా, కాదా అనేది తెలుసుకోవాలి.

2. రోజువారీ చేసే పనులు చేసినా తీవ్రంగా అలసిపోతున్నారా ? చిన్నపాటి వాకింగ్‌కు లేదా మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుందా ? అయితే మీరు బరువు పెరుగుతున్నట్లే లెక్క. కనుక వెంటనే బరువును తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.

3. గురక బాగా పెడుతున్నా కూడా అధిక బరువు ఉన్నట్లే భావించాలి. బరువు ఎక్కువగా ఉన్నవారికి గురక ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమస్య ఉంటే దాన్ని అధిక బరువుగా భావించాలి. వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

4. అధిక బరువు వల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వస్తాయి. ఈ సమస్యలు వస్తుంటే ఒక్కసారి బరువు చెక్‌ చేసుకోవాలి. బరువు అధికంగా ఉండడం వల్ల ఆ సమస్యలు వస్తాయి కనుక ఆ సమస్యలకు కారణం అధిక బరువు ఉండడమే అని భావించాలి. ఒక వేళ అధికంగా బరువు ఉంటే తగ్గాల్సి ఉంటుంది. దీంతో ఆయా సమస్యలు కూడా తగ్గుతాయి.

5. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎవరైనా సరే అధికంగా బరువు పెరుగుతుంటారు. అది సహజమే. కానీ ఏడాదిలో 5-10 కిలోల బరువు పెరిగితే అది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఎప్పటికప్పుడు బరువును చెక్‌ చేసుకోవాలి. అధికంగా బరువు ఉంటే తగ్గే ప్రయత్నం చేయాలి. లేదంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts