డయాబెటిస్‌ ఉన్నవారు బ్లడ్‌ షుగర్‌ టెస్టును ఏ సమయంలో చేయాలి ? ఎలా చేయాలి ?

ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045వ సంవత్సరం వరకు ఈ సంఖ్య 62.9 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏటా పెరుగుతున్న డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా డయాబెటిస్‌ వస్తుండడం మరింత కలవరానికి గురి చేస్తోంది.

what is the best time for blood sugar test and how to do it

అమెరికన్‌ డయాబెటిస్ అసోసియేషన్‌ చెబుతున్న ప్రకారం డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకునే ఆహారాలు, శారీరక శ్రమ, మందులు వంటి అంశాలు వారి షుగర్‌ లెవల్స్‌పై ప్రభావం చూపిస్తాయి. ఇక డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ టెస్టును ఉదయం నిద్ర లేవగానే చేయించుకుంటే మంచిది. అలాగే ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత కనీసం 2 గంటలు ఆగాకే మళ్లీ షుగర్‌ టెస్టును చేయించుకోవాలి.

ఉదయం ఆహారం తీసుకున్న తరువాత షుగర్‌ టెస్టు చేయించుకునేందుకు కనీసం రెండు గంటలు ఆగడం తప్పనిసరి. దీని వల్ల సరైన ఆహారం, మందులను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అల్పాహారం చేయడానికి ముందు షుగర్‌ టెస్టు చేయించుకుంటే అందులో వచ్చే ఫలితాన్ని బట్టి వైద్యులు సులభంగా మందులను రాసేందుకు వీలుంటుంది. అలాగే తిన్న తరువాత రెండు గంటలు ఆగి టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సరైన ఫలితాలు వస్తాయి. అలాగే మీరు వాడే మందులు పనిచేస్తున్నాయో, లేదో సులభంగా తెలిసిపోతుంది.

షుగర్‌ టెస్టు చేయించుకున్న తరువాత వచ్చే ఫలితాలను బట్టి వైద్యులు మందులు ఇస్తారు కనుక కొత్త మందులు ఇస్తే మళ్లీ వైద్యుల సూచన మేరకు టెస్టులు చేయించుకోవాలి. దీంతో కొత్త మందులు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. ఇక డయాబెటిస్‌ ఉన్నవారు డయాగ్నస్టిక్‌ సెంటర్లలో తరచూ టెస్టులు చేయించుకోకపోయినా ఇంట్లో షుగర్‌ టెస్ట్‌ మెషిన్‌ను పెట్టుకోవాలి. దీంతో తరచూ షుగర్ టెస్టు చేయాలి. ఈ విధానం వల్ల అంత కచ్చితమైన ఫలితం రాదు. అయినప్పటికీ ఈ విధంగా టెస్టు చేసి వచ్చే ఫలితాలను డాక్టర్‌కు చెప్పాలి. దీంతో మీకున్న డయాబెటిస్‌పై డాక్టర్లకు సరైన అవగాహన వస్తుంది. వారు మరింత మెరుగైన మెడిసిన్‌ను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

ఇన్సులిన్‌ మీద ఆధారపడ్డ వారు ఇతరుల కన్నా ఎక్కువగా టెస్టులు చేయించుకోవాలి. ఇక టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు అప్పుడప్పుడు రోజుకు 3 సార్లు టెస్టు చేసుకోవాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు ముందు టెస్టు చేసుకోవాలి. అలాగే వ్యాయామం చేశాక, రాత్రి నిద్రకు ముందు అప్పుడప్పుడు టెస్టు చేసుకోవాలి. దీంతో షుగర్‌ లెవల్స్‌ ఏ విధంగా ఉంటున్నాయో అవగాహనకు వస్తారు.

షుగర్‌ టెస్టు మెషిన్‌తో ఇంట్లోనే టెస్టు చేసుకుంటే చేతులను శుభ్రంగా కడుక్కున్నాకే టెస్టు చేయాలి. అలాగే స్ట్రిప్‌ మీద మరీ ఎక్కువ రక్తం లేదా తక్కువ రక్తం పెట్టరాదు. వేలికి పక్క భాగంలో సూదితో పొడిచి రక్తాన్ని సేకరించాలి. తరచూ కచ్చితమైన సమయానికి షుగర్‌ టెస్టులు చేయించుకోవాలి. లేదంటే షుగర్‌ టెస్టు ఫలితాలు సరిగ్గా రావు. ఇలా డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ టెస్టులను చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts