Bottle Gourd Juice For Liver : మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాలేయం మన శరీరంలో అన్నింటి కంటే పెద్ద అవయవం. దాదాపు 500 పైగా పనులను మన కాలేయం నిర్వర్తిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు మన శరీరంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడం వరకు కాలేయం ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా మన శరీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది. కనుక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్, కాలేయంలో వాపు, లివర్ క్యాన్సర్ వంటి వివిధ రకాల కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు.
కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే ముందు మన శరీరం కొన్ని సూచనలను ఇస్తుంది. ఈ సూచనలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నోటి నుండి దుర్వాసన రావడం, మూత్రం ప్రతిరోజూ పసుపు రంగులో రావడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, అలాగే ప్రతిరోజూ నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కాలేయాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల కాలేయం వెంటనే శుభ్రపడుతుంది. కాలేయ ఆరోగ్యం వెంటనే మెరుగుపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరిచే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయను, పసుపును, కొత్తిమీరను, పుదీనాను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక సగం సొరకాయను ముక్కలుగా చేసుకుని ఒక జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో గుప్పెడు కొత్తిమీరను, పుదీనాను వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఇందులో మన రుచికి తగినట్టు నల్ల ఉప్పును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తరువాత తాగాలి. అలాగే ఈ జ్యూస్ ను తాగిన తరువాత గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఈ జ్యూస్ ను తాగడంతో పాటు రోజూ రాత్రి అరకప్పు ఎండు ద్రాక్షలను నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఎండు ద్రాక్షలను ఒక గ్లాస్ నీటిలో వేసి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ నీటిని తాగడంతో పాటు ఎండు ద్రాక్షలను కూడా తినాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కాలేయ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కాలేయం కూడా శుభ్రపడుతుంది. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా మన దరి చేరకుండా ఉంటాయి.