Broccoli : బంగారం క‌న్నా విలువైంది.. రోజూ తినాలి..!

Broccoli : పోష‌కాల ప‌వ‌ర్ హౌస్ గా పిల‌వ‌బ‌డే వాటిలో బ్రోక‌లీ కూడా ఒక‌టి. ఈ మ‌ధ్య‌కాలంలో ఇది మ‌న‌కు విరివిగా ల‌భిస్తుంది. బ్రోక‌లీలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. స‌మ‌తుల్య ఆహారాన్ని తీసుకోవాల‌నుకునే వారు వారి భోజనంలో బ్రోక‌లీని త‌ప్ప‌కుండా చేర్చుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది దీనిని తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ బ్రోక‌లీని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ్రోక‌లీలో ఉండే పోష‌కాల గురించి అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రోక‌లీలో విట‌మిన్ సి, విట‌మిన్ కె, ఫోలేట్, పొటాషియం, ఫైబ‌ర్ వంటి ఎన్నో పొష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల జీవ‌శ‌క్తి పెరుగుతుంది. బ్రోక‌లీ క్యాన్స‌ర్ నివారిణిగా కూడా ప‌ని చేస్తుంది. దీనిలో స‌ల్పోరాఫేన్, ఇండోల్ 3 కార్బినోల్ వంటి ఫైటోకెమిక‌ల్స్ ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను నివారించ‌డంతో పాటు క్యాన్స‌ర్ బారిన ప‌డకుండా కాపాడ‌తాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.బ్రోక‌లీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి శ‌రీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచ‌డంతో పాటు ర‌క్త‌నాళాలు మ‌రియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. బ్రోక‌లీని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అలాగే దీనిలో ఎక్కువ‌గా ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌శ‌క్తిని మెరుగుపరుస్తుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ్రోక‌లీని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. దీనిలో క్యాల్షియంతో పాటు విట‌మిన్ కె కూడా ఉంటుంది.

Broccoli wonderful benefits
Broccoli

ఇవి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా, బ‌లంగా త‌యారు చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా బ్రోక‌లీ యాంటీ ఇన్ ప్లామేట‌రీ లక్ష‌ణాల‌ను కూడా క‌లిగిఉంటుంది. శ‌రీరంలో ఉండే వాపును, నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో బ్రోక‌లీ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. బ్రోక‌లీలో విట‌మిన్ ఎ, లూటీన్, జియాక్సంతిన్ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి కంటి స‌మ‌స్య‌లు రాకుండా కాపాడ‌డంలో దోహద‌ప‌డ‌తాయి. దీనిలో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బ్రోక‌లీని తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్, బ్యాక్టీరియా ల వ‌ల్ల కలిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇక బ్రోక‌లీలో క్యాల‌రీలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు దీనిని తీసుకోవ‌డం వల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ్రోక‌లీని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా బ్రోక‌లి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని క‌నుక దీనిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts