Weight Loss : ఆయుర్వేదం ద్వారా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..? అందుకు ఏయే మూలిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో ఇప్ప‌టికీ చాలా మందికి అస‌లైన‌ ఆయుర్వేదం గురించి తెలియ‌ద‌నే చెప్పాలి. చాలా మంది ప్ర‌జ‌లు ఆయుర్వేదం అంటే ఎదో మొక్క‌ల‌కు చెందిన ఆకులు, మూలిక‌లను వాడి రోగాల‌ను న‌యం చేసేద‌నే అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదం అంటే కేవ‌లం మూలిక‌లు మాత్ర‌మే కాదు. అది ఒక స‌మ‌తుల జీవ‌న విధానం, దానిలో మూలిక‌లు ఒక భాగం మాత్ర‌మే. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది త‌మ జ‌బ్బ‌ల‌ను న‌యం చేసుకోవ‌డానికి ఆయుర్వేద ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. వాటిలో బ‌రువు త‌గ్గ‌డం కూడా ఒక‌టి. అయితే ఆయుర్వేద విధానాల ద్వారా నిజంగా శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా..? అందుకు ఆయుర్వేదంలో ఎలాంటి మూలిక‌లు ఉన్నాయి.. అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగించే వాటిలో మొద‌ట‌గా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ గురించి చెప్పుకోవ‌చ్చు. దీనిని కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాలుగా ఒక హెల్త్ టానిక్ లా వాడుతున్నారు. యాపిల్స్ ను ఈస్ట్ ఇంకా బాక్టీరియాతో పులియ‌బెట్టిన‌పుడు అది యాసిడ్ గా మారి యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ త‌యార‌వుతుంది. దీనిలో ఉండే ముఖ్య ప‌దార్థం ఎసిటిక్ యాసిడ్ 5 నుండి 6 శాతం ఉంటుంది. ఇక ఈ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఇది ర‌క్తంలోని షుగ‌ర్, ఇన్సులిన్ లెవ‌ల్స్ ని త‌గ్గిస్తుంది. దీనిలోని ఎసిటిక్ యాసిడ్ కి కొవ్వుని క‌రిగించే గుణాలు ఉన్నాయ‌ని నిరూపించ‌బ‌డింది. అలాగే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

can ayurveda helps for Weight Loss what are the herbs
Weight Loss

ఇంకా ప‌సుపు, మిరియాలు కూడా శ‌రీర బ‌రువును త‌గ్గించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. ప‌సుపులో ఉండే క‌ర్క్యుమిన్ అనే పదార్థం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అంతే కాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ఇంకా జీవ‌క్రియ‌ను మెరుగుప‌రిచే గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవ‌న్నీ శ‌రీరంలోని కొవ్వుని క‌రిగించ‌డంలో తోడ్ప‌డుతాయి. ఇంకా మిరియాల‌లో ఉండే విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె మొద‌లైన‌వి మ‌నిషి దేహంలోని జీవ‌క్రియల‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేస్తాయి. ఇవి కొవ్వును క‌రిగించ‌డంలో స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేదంలో ఈ విధంగా పైన‌ చెప్పిన ప‌దార్థాల‌ను బ‌రువు త‌గ్గడానికి విరివిగా వాడుతున్నారు. వీటిని ఉప‌యోగించి ఎవ‌రైనా స‌రే సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

Prathap

Recent Posts