డయాబెటీస్ రోగులకు దాని ప్రభావం ఉద్యోగంపై ఏ మాత్రం వుండదు. డయాబెటీస్ కలిగి వుండటం మీ తప్పుకాదు. కనుక దానిని దాచవద్దు. మీ తోటి ఉద్యోగులకు మీకు డయాబెటీస్ వుందని కూడా తెలియచేయండి. హైపో అనే లో షుగర్ గురించి వివరించండి. షుగర్ పడిపోతే ఏం చేయాలో ముందస్తుగా వారికి తెలియజేయండి. విషయం తెలియకుంటేనే తోటివారు ఆందోళనపడతారు. మతపర కారణాలుగా ఒక్కోక్కపుడు ఉపవాసాలు వుండటం జరుగుతుంది. ఈ రకమైన ఉపవాసాలు వీరి విషయంలో నష్టం కలిగించే ప్రమాదముంది. అయినప్పటికి ఉపవాసం వుండాలంటే, సందేహం కలిగితే, నిపుణులను ఒకసారి సంప్రదించండి. మీ శారీరక స్ధితి మీకే తెలుస్తుంది.
ఉపవాసం ఉన్నపుడు శరీరం తక్కువ దశ షుగర్ కు పడిపోతోందా అని తెలుసుకోడానికి వేలితో శరీరాన్ని గుచ్చి గుంటపడితే లో షుగర్ వచ్చిందని గ్రహించండి. ఇన్సులిన్ తీసుకునే వారైతే దాని పరిమాణాన్ని తీసుకోడం తగ్గించండి. టాబ్లెట్ వాడే వారైతే దానిని వేయకండి. హాస్పిటల్ లో చేరేసమయంలో డయాబెటీస్ నియంత్రణ ప్రధానం. ఏ కారణం చేతైనా హాస్పిటల్ లో చేరితే, అక్కడి డాక్టర్లకు నర్సులకు మీరు డయాబెటిక్ అని తెలుపండి. దాని నియంత్రణ ఎలా వుందో వివరించండి. డయాబెటీస్ మంచి నియంత్రణలో వుంటే మీరు హాస్పిటల్ లో చేరిన వ్యాధులు త్వరగా తగ్గే అవకాశం కూడా వుంది.
హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు మీ రెగ్యులర్ మెడిసిన్ కొనసాగించండి. కొంతమంది మహిళలు తమ రుతుక్రమంలో డయాబెటీస్ కారణంగా ఏ మార్పు పొందరు. రుతుక్రమం ముందు షుగర్ పెరుగుతోందా? ఇన్సులిన్ లేదా టాబ్లెట్ వాడకం పెంచండి. షుగర్ తగ్గుతూంటే వాటి వాడకం తగ్గించండి. ఇటువంటపుడు మీ శరీరానికి తగిన డోసేజీని మీరే నిర్ధారించుకోవాలి.