Calcium Tablets : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. క్యాల్షియం మన శరీరానికి ఎంతో అవసరం. ఎముకలను ధృడంగా ఉంచడంలో, దంతాలను దృడంగా ఉంచడంలో క్యాల్షియం అవసరమవుతుంది. శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఎముకలు గుళ్ల బారడం వంటి సమస్యలు తలెత్తూ ఉంటాయి. చాలా మంది క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవడానికి క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడడం వల్ల క్యాల్షియం లోపం రాకుండా ఉన్నప్పటికి వీటిని అతిగా వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాల్షియం సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
క్యాల్షియం సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువగా ఉండే క్యాల్షియం ఇతర లవణాలతో కలిసి రాళ్ల లాగా ఏర్పడి మూత్రనాళాల్లో చిక్కుకుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, వికారం, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో సత్వర చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అయితే క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మాత్రమే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయా.. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం కలగదా.. అన్న సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. అయితే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మనం తీసుకునే ఆహారంలో అధికంగా ఉండే క్యాల్షియాన్ని ప్రేగులు ఆక్సలైట్స్ తో బంధిస్తాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మూత్రిండాల్లో రాళ్లు ఏర్పడకుండాఉండాలంటే ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే బీట్ రూట్, చాక్లెట్స్, గింజలు, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలను క్యాల్షియం సప్లిమెంట్స్ తో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే క్యాల్షియం సప్లిమెంట్స్ కు బదులుగా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.