మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే పదార్థాల్లో కోడిగుడ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కలిగించేవే. అయితే కోడిగుడ్లు సహజంగానే వేడినిచ్చే స్వభావం కలిగి ఉంటాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది ఎండాకాలంలో గుడ్లను తినేందుకు వెనుకంజ వేస్తుంటారు. లేదంటే బాడీ మరింత హీట్‌కు గురై ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయేమోనని వారి భయం. అయితే కోడిగుడ్లను నిజంగానే ఎండాకాలంలో తినకూడదా? తెలుసుకుందాం రండి!
కోడిగుడ్లు శరీరానికి వేడినిచ్చే స్వభావాన్ని కలిగి ఉంటాయన్నమాట నిజమే. అయినా వాటిని ఎండాకాలంలో నిర్భయంగా తినవచ్చని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. ఎందుకంటే వేసవిలో కోడిగుడ్లను తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు ఎండ కారణంగా మన శరీరం గ్రహించుకునే ఉష్ణాన్ని తగ్గించడంలోనూ కోడిగుడ్లు ఉపయోగపడతాయి. కాబట్టి వేసవిలో కోడిగుడ్లను నిర్భయంగా తినవచ్చు. వాటి వల్ల ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు.
అయితే కోడిగుడ్లను ఫ్రైగా కాక ఉడకబెట్టుకుని తింటే మంచిది. ఎందుకంటే గుడ్లను ఫ్రై చేస్తే వాటిలోని పోషకాలు ఆవిరయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాయిల్డ్ ఎగ్స్‌ను మాత్రమే తినాలి. ఎలాంటి శరీర తత్వం కలవారైనా వేసవిలో రోజుకు 2 గుడ్లను తినవచ్చు.