హెల్త్ టిప్స్

క్యాన్స‌ర్ ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

క్యాన్సర్‌ ఉన్న వాళ్లలో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్‌ ఫెటీగ్‌) చాలా సాధారణం. దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో కుంగుబాటుకు గురతుంటారు. దీంతో వారి జీవనశైలిపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌ ఉన్న వారు తన పనులను ఉత్సాహంగా చేసుకోలేరు. ఈ నిస్సత్తువకు అనేక కారణాలు ఉంటాయి. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి అస్సలే ఉండదు. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. రక్తహీనత (అనీమియా) అనే కండిషన్‌ క్యాన్సర్‌ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణమే. సాధారణంగా (బ్లడ్‌ క్యాన్సర్‌) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఇవే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను తీసుకెళ్తాయి. దీంతో కణాలకు అందే ఆక్సిజన్‌ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పతుంది.

క్యాన్సర్‌ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీలతోనూ బోన్‌ మ్యారో క్యాన్సర్‌లకు అందించే మందులతో కూడా వారిలో అ«ధిక నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల సమయంలో క్యాన్సర్‌ కణాల్ని తుదముట్టించే క్రమంలో కొన్ని ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ఈ కారణంగా కూడా నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. నీరసం, నిస్సత్తువ ఉన్నా ప్రారంభంలో ధైర్యంగా ఉంటూ పౌష్టికాహారం , నిత్యం వ్యాయామం చేస్తే క్యాన్సర్‌ ఫెటీగ్ ను అధిగమించవచ్చు. రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు గురికాకుండా యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నించాలి. తద్వారా దేహం, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్‌ అనే రసాయనాలు స్రవించి రోగిలో సంతోషభావనలు కలుగుతాయి.

cancer patients must follow these tips

చాలామంది తమ బరువు కోల్పోయి వెంటనే సన్నబడతారు. రోగులు తమ వ్యాకులతతో సరైన సమయానికి తినకపోవడం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. నోటికి రుచికర ఆహార పదార్థాలు తీసుకునేందుకు సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించాలి. దీంతో వారు సూచించిన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, ద్రవాహారాలతో పాటు ఇతర పోషకాలను తీసుకోవాలి. చాలామందిలో తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దీంతో వారు మరింత నిస్సత్తువగా మారిపోతాడు. క్యాన్సర్‌ రోగులకు నిద్ర చాలా అవసరం. రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్‌ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నాం చిన్న చిన్న కునుకులు తీయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. కంటినిండా నిద్రపోవడంతో రోగిలో వ్యాధి నివారణశక్తి పెరుగుతుంది.

రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్‌ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు. క్యాన్సర్‌ రోగులెవరైనా క్యాన్సర్‌ ఫెటీగ్‌తో బాధపడుతుంటే ఈ మందులు వాటిని అధిగమించవచ్చు. ఒకవేళ అది కాకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవాలి.

Admin

Recent Posts