Cardamom Tea Benefits : యాలకులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది సుగంధ ద్రవ్యంగానే కాక ఆరోగ్య ప్రదాయిని కూడా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో యాలకులను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు రోజూ యాలకులను నమిలి తింటుంటారు కూడా. అయితే యాలకులను అలా నేరుగా తినలేని వారు వాటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. రోజూ ఉదయాన్నే యాలకుల టీ తయారు చేసి తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. యాలకులు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ ఏదో ఒకవిధంగా తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
యాలకుల టీ ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. యాలకులను ప్రకృతి వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిని క్యాన్సర్ చికిత్సకు వాడుతుంటారు. కనుక యాలకుల టీ తాగితే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఉదయం యాలకులతో చేసిన టీ తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా రోజూ తాగితే డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.
యాలకులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. యాలకుల టీని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే విరేచనాలు కూడా తగ్గుతాయి.
హైబీపీ సమస్యతో బాధపడుతున్న వారికి యాలకులు అద్భుతమైన వరమనే చెప్పవచ్చు. యాలకులతో చేసే టీని రోజూ తాగితే బీపీ తగ్గుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
యాలకులను తినడం వల్ల లేదా యాలకుల టీని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రంగా మారుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. నోటి సంబంధ సమస్యలు ఉండవు. ఇలా యాలకులతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ వాటితో చేసే టీని తాగడం మరిచిపోకండి.