Carrot And Beetroot Juice : మన ఇంట్లోనే ఒక చక్కటి రుచికరమైన జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, మారిన జీవన శైలి వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, రక్తనాళాల్లో అడ్డంకులు, గుండె పోటు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు మనం ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం.
అధిక బరువుతో బాధపడే వారు ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. అధిక బరువు సమస్య నుండి బయట పడేసే జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్ ను, ఒక ఆపిల్ ను, 4 ఖర్జూర పండ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా క్యారెట్ లను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆపిల్ ను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లో వేసుకోవాలి.
తరువాత ఖర్జూర పండ్లను గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ జ్యూస్ ను నేరుగా ఇలాగే తాగవచ్చు లేదా వడకట్టుకుని కూడా తాగవచ్చు. రోజూ ఉదయం పూట ఈ జ్యూస్ 200 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. తరువాత మొలకెత్తిన గింజలను లేదా డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఉదయం పూట ఇడ్లీ, దోశ, పూరీ వంటి ఇతర అల్పాహారాలను మానేసి ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
ఇలా చేయడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడంతో పాటు ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మం బిగుతుగా, అందంగా తయారవుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. బీపీ అదుపులో ఉంటుంది. ఈ విధంగా క్యారెట్, బీట్ రూట్, ఆపిల్ తో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.