Cloves : మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. వంటల్లో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. లవంగం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. దీనిని వంట్లలో వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుందనే చెప్పవచ్చు. కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా లవంగాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. లవంగాలను ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అలాగే లవంగాల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఎన్నో మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. రోజూ ఉదయం పరగడుపున లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ నమిలి తినడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ ఉదయం పరగడుపున ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. అలాగే లవంగాలను తినడం వల్ల రక్తహీనత సమస్య దరి చేరకుండా ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అలాంటి వారు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినడం వల్ల ఒత్తిడి తగ్గి చక్కగా నిద్రపడుతుంది. అలాగే లవంగాలను తినడం వల్ల దంతాల నొప్పులు రాకుండా ఉంటాయి. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడే వారు రోజూ ఉదయం పరగడుపున లవంగాలను తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
లవంగాలను తినడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే లవంగాలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలు ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని రోజూ ఒకటి లేదా రెండు లవంగాలను పరగడుపున చప్పరిస్తూ నమిలి తినడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.