Cold And Hot Milk : చ‌ల్ల‌ని పాలు.. వేడి పాలు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి..?

Cold And Hot Milk : ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల నిత్యం ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. పాలు మనకు శక్తి నివ్వడమే కాకుండా మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎముకల పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, క్యాల్షియం పాలలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు తప్పనిసరిగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు పాలు తాగిస్తే శరీర పెరుగుదలతో పాటు మెదడు చురుకుగా పనిచేసి మానసికంగా అభివృద్ధి చెందుతారు.

అయితే చాలా మందికి పాలు తాగే విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా మన ఆరోగ్యానికి వేడి పాలు తాగితే మంచిదా..లేక చల్లటి పాలు తాగితే మంచిదా.. అన్న సందేహం చాలామందిలో వస్తుంటుంది. అయితే వైద్యుల సూచన ప్రకారం వేడి పాలు తాగిన, చల్లటి పాలు తాగిన సంపూర్ణ ఆరోగ్యానికి మంచిదే. అయితే పచ్చిపాలను మాత్రం తాగకూడదు. పాలను బాగా వేడి చేసి గోరు వెచ్చగా అయిన లేదా చల్లటి పాలైన తాగవచ్చు.

Cold And Hot Milk which one is better for us
Cold And Hot Milk

శీతాకాలం మరియు వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. కావున వేడి పాలు తాగడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే సుఖ ప్రదమైన నిద్ర కోసం గోరు వెచ్చని పాలు లేదా వేడి పాలు తీసుకోవడం మంచిది. చల్లటి పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కావున కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో చల్లటి పాలు తాగే అలవాటు మానుకోవాలి. లేదంటే కొంతమందిలో జీర్ణ సమస్యలు, దగ్గు, రొంప వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాలను తీసుకోవడం మంచిది. దీంతో అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Editor

Recent Posts