Copper Water Benefits : మన దేశంలో శతాబ్దాల కాలం నుండే నీటిని శుభ్రం చేసేందుకు రాగి పాత్రలను ఉపయోగించేవారు. రాగి చెంబులతో నీటిని తాగే వారు. రాగి పాత్రలను, రాగి చెంబులను వాడడానికి కారణాలు లేకపోలేదు. రాగి పాత్రలను, రాగి చెంబులను ఉపయోగించడానికి వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య కిరణాలు రాగి పాత్రలపైన పడినప్పుడు జరిగే రసాయన క్రియ కారణంగా అందులో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు దాదాపు దూరంగా ఉండవచ్చు. శరీరంలో కాపర్ నిల్వలు తక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్ నిల్వలు పెరుగుతాయి.
ఫలితంగా థైరాయిడ్ సమస్యను నివారించవచ్చు. కడుపులో మంట, అసిడిటి, అజీర్తి వంటి మొదలగు జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారు రాగి చెంబులో నీటిని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్లకు కవచంలా ఉపయోగపడే మైలిన్ తొడుగులు తయారుకావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుంది. రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల నీటి ద్వారా వ్యాపించే డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. దీని బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది.
రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తపోటు బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ పాత్రల్లో నీటిని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరి చేరుకుండా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కాపర్ తన వంతు పాత్రను పోషిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. అదే విధంగా బరువును కూడా తగ్గిస్తుంది.
అంతేకాకుండా రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల ఎముకలు ధృడంగా అవుతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రాగి పాత్రల్లో నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగి అనారోగ్యాల బారిన పడడానికి బదులుగా రాగి పాత్రల్లో నీటిని తాగి చక్కటి ఆరోగ్యాన్ని పొందవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.