Cumin Water : మనం జీలకర్రను ప్రతిరోజూ వంటలను తయారు చేయడంలో వాడుతూ ఉంటాం. జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. జీలకర్రతో కషాయాన్ని కూడా చేసుకుని మనం తాగవచ్చు. జీలకర్ర కషాయాన్నే జీలకర్ర నీరు అని కూడా అంటారు. ఈ నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణశక్తితోపాటు పేగుల కదలికలను పెంచడంలో జీలకర్ర నీరు ఎంతో సహయాపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల పుల్లటి త్రేన్పులు, పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ మూలకం కాలేయాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల మనం తినే ఆహారంలో ఉండే మలినాలను తొలగించడంతోపాటు శరీరంలో పేరుకు పోయిన వ్యర్థాలు కూడా తొలగించబడతాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా జీలకర్ర నీరు ఎంతగానో సహాయపడుతుంది.
శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో కూడా జీలకర్ర నీరు సహయపడుతుంది. గర్భిణీ స్త్రీలలో ఉండే నొప్పులను, నీరసాన్ని, మలబద్దకాన్ని తగ్గించడంలోనూ జీలకర్ర నీరు ఎంతగానో సహయాపడుతుంది. జీలకర్ర నీటిని మనం ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒకటిన్నర గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఒక గ్లాసు నీళ్లు య్యే వరకు మరిగించాలి. ఇలా మరిగించుకున్న నీటిని జల్లిగంట సమాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీటిలో తేనె, నిమ్మరసాన్ని కలుపుకుని తాగవచ్చు. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చు. ప్రతి రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.