Dates : ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్ అనే చక్కెర కూడా ఉంటుంది. ఉపవాస దీక్ష చేసే వారు వీటిని అల్పాహారంగా తీసుకుంటే శక్తి లభిస్తుంది.
బలహీనంగా ఉండే వారు బరువు పెరిగేందుకు ఖర్జూరాలు ఉపయోగపడతాయి. వీటిల్లో కొవ్వులు, ప్రోటీన్లు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు కూడా ఎక్కువగా లభిస్తాయి. కనుక బరువు పెరగాలని చూసే వారికి ఇవి ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. గుండె జబ్బులు ఉన్నవారు వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తగా చేసి తినాలి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిని రోజూ తింటే మసక, రేచీకటి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఖర్జూరాల్లో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాల్లో విటమిన్ ఎ, సి లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ పండ్లలోని పొటాషియం నరాలను దృఢంగా మారుస్తుంది. రక్తం వృద్ధి చెందుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.