హెల్త్ టిప్స్

Diabetes And Coffee : షుగ‌ర్ ఉన్న‌వారు కాఫీని అస‌లు ఎప్పుడు తాగాలి..?

Diabetes And Coffee : ప్రతి ఒక్కరు, ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్నట్లయితే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే, అనవసరంగా అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. షుగర్ ఉన్నట్లయితే టీ, కాఫీలు తీసుకువచ్చా లేదా అనే సందేహం కూడా చాలామందిలో ఉంది. చాలామంది, ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. కాఫీ లేదా టీ తాగకపోతే, ఏ పని కూడా చేయలేకపోతుంటారు. అలవాటు అయిపోతూ ఉంటుంది.

రోజంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతుంటారు. ఉదయం సమయంలో బ్లాక్ కాఫీ ని కానీ టీ ని కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఉదయం తీసుకునే కాఫీ తర్వాత, తీసుకునే ఆహారం మీద ప్రభావం చూపి, జీవక్రియ అలానే చక్కెర స్థాయిలో దెబ్బతింటాయి. కనుక రాత్రి పడుకుని, ఉదయం లేచాక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ, టీ తాగడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా, షుగర్ ఉన్న వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక, కాఫీ కానీ టీ కానీ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

what is the best time to take coffee if you have diabetes

ఎందుకంటే కాఫీ లో ఉండే కెఫీన్ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ ఉన్నట్లయితే, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే షుగర్ కంట్రోల్ లో ఉండదు. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి, ఈ తప్పులు చేయకుండా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

అలానే ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ని కూడా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలానే, నిపుణులు సలహా కూడా తీసుకుంటూ ఉండాలి. అనవసరంగా, ఆరోగ్యాన్ని విషయంలో అశ్రద్ధ చేయకూడదు. వీలైనంతవరకు ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.

Admin

Recent Posts