Diabetes And Honey : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె, పండ్ల‌ను తీసుకోవ‌చ్చా..? తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Diabetes And Honey : ఈ మ‌ధ్య కాలంలో షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది. అలాగే ఆహార నియ‌మాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంచ‌దార మ‌రియు తీపి ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. దీంతో చాలా మంది పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇలా తేనెను ఉప‌యోగించిన‌ప్ప‌టికి చాలా మందికి తేనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి పెరుగుతుందేమో… అనే అనుమానాన్ని క‌లిగి ఉంటారు. అయితే అసలు షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తేనెను ఉప‌యోగించ‌వ‌చ్చా… ఒక‌వేళ ఉప‌యోగిస్తే ఎంత మోతాదులో ఉప‌యోగించాలి.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రకృతి ప్ర‌సాదించిన మ‌ర‌ణం లేని ఆహారాల్లో తేనె ఒక‌టి. స్వ‌చ్ఛ‌మైన తేనె ఎప్ప‌టికి పాడ‌వదు. తేనె యాంటీ బ‌యాటిక్ లక్ష‌ణాల‌ను, హీలింగ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు ఎన్నో విధాలుగా తేనె మేలు చేస్తుంది. తేనెలో 35 శాతం గ్లూకోజ్, 39 శాతం ప్ర‌క్టోజ్ షుగ‌ర్ ఉంటుంది. తేనెను తీసుకున్న‌ప్పుడు దీనిలో ఉండే గ్లూకోజ్ వెంట‌నే ర‌క్తంలో క‌లుస్తుంది. అలాగే ప్ర‌క్టోజ్ షుగ‌ర్ గ్లూకోజ్ లాగా మారిన త‌రువాత ర‌క్తంలో క‌లుస్తుంది. క‌నుక రక్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెర‌గ‌కుండా ఉంటాయి. అదే పంచ‌దార అయితే దీనిలో ఉండేది పూర్తిగా గ్లూకోజ్ క‌నుక వెంట‌నే ర‌క్తంలో క‌లుస్తుంది. తేనె, పంచ‌దార తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికి వీటి రెండింటికి చాలా తేడా ఉంటుంద‌ని తేనె నెమ్మ‌దిగా ర‌క్తంలో క‌లుస్తుంద‌ని, పంచ‌దార వెంట‌నే ర‌క్తంలో క‌లుస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Diabetes And Honey can they take it or not
Diabetes And Honey

అయితే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తేనెను ఎప్పుడూ తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలో. ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ప్పుడు, గుండె ద‌డ‌గా ఉన్న‌ప్పుడు, చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌డుతున్న‌ప్పుడు తేనెను తీసుకోవాలి. షుగ‌ర్ స్థాయిలు త‌గ్గిన‌ప్పుడు చాలా మంది తియ్య‌గా ఉండే బిస్కెట్లు వంటి వాటిని తింటూ ఉంటారు. వాటికి బ‌దులుగా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు 2 లేదా 3 టీ స్పూన్ల తేనెను నాక‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పంచ‌దార‌, బిస్కెట్ల‌కు బ‌దులుగా వారి వ‌ద్ద ఎల్ల‌ప్పుడూ తేనెను ఉంచుకోవ‌డం మంచిది. అలాగే ఉద‌యం పూట అల్పాహారంగా ఆల‌స్యంగా తీసుకునే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు నీర‌సం రాకుండా ఒక గ్లాస్ నీటిలో తేనె క‌లిపి తీసుకోవ‌చ్చు.

ఇలా షుగ‌ర్ స్థాయిలు త‌గ్గిన‌ప్పుడు మాత్ర‌మే 2 లేదా 3 టీ స్పూన్ల తేనెను ఉప‌యోగించ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇత‌రులు వాడిన‌ట్టు 5 లేదా 6 టీ స్పూన్ల తేనెను మాత్రం ఒకేసారి వాడ‌కూడ‌దని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను వాడ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికి త‌గిన మోతాదులో వాడ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు. త‌క్కువ మొత్తంలో తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి కూడా పెర‌గ‌కుండా అదుపులో ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పండ్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. అయితే త‌క్కువ చ‌క్కెర‌లు క‌లిగి ఉండే పండ్ల‌ను తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts