కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కర్పూరంను దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరం ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది.
చాలా రకాల సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అయితే మామూలుగా కొంతమంది ప్రతిరోజూ స్నానం చేస్తే మరి కొందరు రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసిన తర్వాత ఒక గంటలోపే ఆ తాజాదనం మొత్తం పోతుంది. నెమ్మదిగా చెమట వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన రాకుండా ఉండడం కోసం చాలామంది పెర్ఫ్యూమ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పర్ఫ్యూమ్ లు కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉండవచ్చు అని చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందట. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారు ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉందట. అలాగే గోరు వెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట , బలహీనత తగ్గుతాయట. మీరు చురుకుగా కూడా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుందట. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.