ఆహారం తినడం కోసం మనకు దంతాలు ఏ విధంగా అవసరమో, వాటిని జాగ్రత్తగా ఉండేలా సంరక్షించుకోవడం కూడా అంతే అవసరం. దంతాలు బాగా లేకపోతే మనం ఆహారం తినలేం. దీనికి తోడు నలుగురిలోకి వెళ్లినప్పుడు నవ్వాలన్నా, వారితో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తమ దంతాల పట్ల సంరక్షణ వహించాల్సిందే. అయితే దంతాలు వాటిలో చేరే ఆహారం వల్ల, బాక్టీరియా వల్ల, ఇతర కారణాల వల్ల ఒక్కోసారి క్షయానికి గురవుతుంటాయి. దీనికి తోడు చిగుళ్ల సమస్య ఉన్నా దంత క్షయం వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దంతాలను శుభ్రం చేసుకోవడంతోపాటు చిగుళ్లను సంరక్షించుకున్నప్పుడే దంత క్షయం కూడా ఆగుతుంది. ఈ క్రమంలో చిగుళ్లను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని వేడి చేసి దాన్ని నోట్లో వేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేసినట్టు పుక్కిలించాలి. దీంతో కొద్ది రోజుల్లోనే చిగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు ఇలా చేయడం వల్ల దంత క్షయం కాకుండా ఉంటుంది. గ్రీన్ టీని నిత్యం తాగుతున్నా దంతాలు, చిగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా తాగడం వల్ల వాపుకు గురైన చిగుళ్ల సమస్య తగ్గుతుంది. చెడు బాక్టీరియా పోతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలోవెరా (కలబంద)లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దంతాలు, చిగుళ్ల సమస్య నుంచి రక్షిస్తుంది. నిత్యం కొద్దిగా అలోవెరా జెల్ లేదా జ్యూస్‌ను నోటిలో పోసుకుని పుక్కిలిస్తున్నట్టయితే దంతాలు, చిగుళ్ల సమస్యలన్నీ తొలగిపోతాయి.
నోటిలో పేరుకుపోయిన చెడు బాక్టీరియాను నిర్మూలించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చిగుళ్ల సమస్యను తగ్గిస్తుంది. కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను తీసుకుని కొంత నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా పుక్కిలించాలి. రోజూ ఇలా చేస్తే త్వరలోనే దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. మిర్ (Myrrh) అనే రెజిన్‌ను చిగుళ్లపై డైరెక్ట్‌గా అప్లై చేయాలి. దీని వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. మనకు మిర్ మార్కెట్‌లో దొరుకుతుంది. యారో (Yarrow) అని పిలవబడే మొక్క పూలు లేదా ఆకులను బాగా నలిపి చిగుళ్లపై పూతలా రాయాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి. యారోలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.