Bendakayalu : మన అనేక రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బెండకాయ ఒకటి. బెండకాయను పోషకాల గనిగా చెప్పవచ్చు. దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. బెండకాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. పులుసు కంటే కూడా బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయ తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికి దీనిని ఆహారంగా తీసుకున్న కొన్ని పదార్థాలను మనం అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. బెండకాయలను తిన్న తరువాత తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ మన శరీరానికి పోషకాలను, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, క్యాల్షియం వంటి వాటితో పాటు వివిధ రకాల పోషకాలు కూడా ఉన్నాయి. బెండకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ కూర వంటి వాటిని అందరూఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తిన్న తరువాత కాకరకాయను అస్సలు తీసుకోకూడదు. బెండకాయ తిన్న తరువాత కాకరకాయను లేదా కాకరకాయ తిన్న తరువాత బెండకాయను అస్సలు తినకూడదు. ఇవి రెండు కడుపులో చేరిన తరువాత వాటి మధ్యలో చర్యలు జరిగి విషంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనుక బెండకాయను తీసుకున్న తరువాత కాకరకాయను తినకూడదు.
అలాగే మనలో చాలా మందికి మిగిలిన కూరగాయలన్నింటిని కలిపి ఒకే కూర చేసే అలవాటు ఉంది. ఇలా ఎప్పుడూ కూడా అన్ని కూరగాయలను కలిపి వండకూడదు. ఎందుకంటే అవి ఒక దానితో మరొకటి కలిసి ఉండే మినరల్స్ ను కలిగి ఉండవు. అవి విషంగా మారే ప్రమాదం కూడా ఉంది. అలాగే బెండకాయ తిన్న తరువాత ముల్లంగిని తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల వాటి మధ్య రసాయనిక చర్యలు జరిగి శరీరంలో తెల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కనుక బెండకాయ తరువాత ముల్లంగిని లేదా ముల్లంగి తరువాత బెండకాయను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలను మరియు ముల్లంగిని బెండకాయ తిన్న తరువాత తినకూడదని ఇలా తింటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.