Papaya : చాలామంది ఆరోగ్యానికి మంచిదని బొప్పాయిని తీసుకుంటూ ఉంటారు. బొప్పాయిని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. విటమిన్ ఎ, విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా బొప్పాయితో పొందవచ్చు. బొప్పాయి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. భోజనంతోపాటు బొప్పాయిని తీసుకుంటే విషంతోపాటు, ప్రాణాపాయం కూడా వస్తుందని చాలా మందికి తెలియదు.
బొప్పాయి నిజానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయి. ఆల్ఫా, బీటా కెరోటిన్ కూడా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అలర్జీలతో పోరాడుతుంది. గాయాలని కూడా నయం చేస్తుంది.
బొప్పాయిని చాలా మంది సలాడ్స్ లో కూడా వేసుకుంటారు. అయితే సలాడ్ లో వేసినప్పుడు మనం నిమ్మరసం కూడా వేసుకుంటూ ఉంటాము. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే విషం తీసుకున్నట్లే. ఇలా తీసుకోవడం వలన రక్తహీనత, హిమోగ్లోబిన్ అసమతుల్యతలకి దారితీస్తుంది. పిల్లలకి, పెద్దలకి కూడా ఇది ప్రమాదమే. కాబట్టి ఈ పొరపాటు చేయొద్దు. బొప్పాయిని ఒక కప్పు లేదా మూడు సన్నని ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.
అనేక ఇబ్బందులు కలగవచ్చు. బొప్పాయిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బొప్పాయిని తీసుకోవడం వలన కడుపు నొప్పి వంటివి కూడా కలుగుతాయి. ఎక్కువగా బొప్పాయిని తీసుకోవడం వలన అతిసారం తీవ్రంగా మారుతుంది. కాబట్టి ఈ పొరపాట్లని బొప్పాయి విషయంలో చేయకండి. అనవసరంగా ఇబ్బంది పడాలి. బొప్పాయిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కనుక లిమిట్ గా పండ్ల ముక్కలు తీసుకోవడం లేదంటే జ్యూస్ చేసుకుని తీసుకోవడం మంచిది.