హెల్త్ టిప్స్

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తిన‌కండి.. ఎందుకంటే….?

మ‌న దేశంలోని ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్ర‌జ‌లు త‌మ ఆహారపు అల‌వాట్ల‌కు అనుగుణంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, ఇత‌ర స‌మ‌యాల్లో భోజ‌నాలు చేస్తుంటారు. అయితే చాలా మంది కామ‌న్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఒక‌టి బ్రెడ్‌. రెండు బ్రెడ్ ముక్క‌ల‌ను కాల్చి టోస్ట్‌గా చేసుకుని దానిపై జామ్ లేదా వెన్న లాంటిది వేసుకుని కొంద‌రు తింటారు. ఇక కొంద‌రు బ్రెడ్ పై జామ్ రాసుకుని లాగిస్తారు. కొంద‌రు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తింటారు. అయితే నిజానికి రోజులో ఏ స‌మయంలో అయినా బ్రెడ్ తిన‌వ‌చ్చు కానీ ఉద‌యం పూట మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తిన‌కూడ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌రి వారు అలా ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తిన‌డం వ‌ల్ల అందులో ఉండే గ్లూటెన్ అనే ప‌దార్థం మ‌న‌కు అసిడిటీ స‌మ‌స్య‌ను తెచ్చి పెడుతుంద‌ట‌. అలాగే ఉద‌యాన్నే బ్రెడ్ తిన‌డం వల్ల మెద‌డు ప‌నితీరు త‌గ్గి, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. అందువ‌ల్ల ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్‌ను అస్స‌లు తిన‌వ‌ద్ద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

do not take white bread in breakfast

అయితే మ‌రి బ్రెడ్ తిన‌క‌పోతే ఎలా ? అదే త్వ‌ర‌గా అయ్యే బ్రేక్‌ఫాస్ట్ క‌దా. మ‌న‌కు టైం ఉండ‌దు. మ‌రి ఏం ఫుడ్ తినాలి ? అని అడిగితే.. అవును, ఉద‌యం బ్రెడ్ తిన‌కూడ‌దు. కానీ దానికి బ‌దులుగా సంప్ర‌దాయ ఫుడ్స్‌ను తిన‌వ‌చ్చు. పండ్లు తిన‌వ‌చ్చు. అవేవీ తిన‌లేం, మాకు బ్రెడ్డే కావాలి.. అని ఎవ‌రైనా భావిస్తే.. వారు బ్రెడ్ తిన‌వ‌చ్చు. కానీ దాన్ని తిన్నాక పండ్ల‌ను తింటే దాని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి కొంత వ‌ర‌కు త‌ప్పించుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఇక‌పై మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ను తిన‌డం మానేయండి. లేదంటే మానసిక స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తారు..!

Admin

Recent Posts