హెల్త్ టిప్స్

నిమ్మ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

నిమ్మకాయలో ఉండే విటమిన్లు, పోషకాల‌ వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫారిక్ యాసిడ్ మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్ అనే ఖనిజం రక్తహీనత నుండి కాపాడుతుంది.నిమ్మకాయను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణాశయంలోని క్రిములు నశిస్తాయి.

నిమ్మరసం రక్త నాళాల్లో కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. వేసవి కాలంలో కలిగే తాపాన్ని పంచదార, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచిది. వాంతులను, విరోచనాలు, జ్వరం వచ్చిన వారికి కలిగే అతి దాహాన్ని నివారిస్తుంది. గొంతులో టాన్సిల్స్ ఉన్నవారు ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి కొన్నాళ్ల పాటు తాగితే టాన్సిల్స్ తగ్గిపోతాయి.

do you know these benefits about lemon juice

ఇంకా మూత్రాశయంలో ఏర్పడిన రాళ్ళను కరిగిస్తాయి.అంతేకాక తరచూ జలుబు చేసేవారు ఈ మిశ్రమాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం సమస్య తో బాధపడేవారు కూడా ఈ మిశ్రమాన్ని రోజు రాత్రి పడుకునే ముందు తాగాలి. అజీర్ణము, పొట్ట ఉబ్బరంగా ఉన్నవారు ఆహారంలో నిమ్మరసం చేర్చుకుంటే మంచిది.

Admin

Recent Posts