మనకు తాగేందుకు అనేక రకాల టీ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వైట్ టీ ఒకటి. చాలా మంది అనేక రకాల టీ ల గురించి విని ఉంటారు. కానీ వైట్ టీ గురించి చాలా మందికి తెలియదు. దీన్నే కమెల్లియా టీ అని పిలుస్తారు. ఇది మనకు బయట లభిస్తుంది. ఈ సీజన్‌లో కచ్చితంగా ఈ టీని తాగాలి. దీంతో అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
కమెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని తయారు చేస్తారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వైట్ టీని రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తప్పుతుంది. ఈ టీలో కెఫీన్, ఏజీసీజీ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువును తగ్గించుకోవచ్చు.
వైట్ టీలో ఫ్లోరైడ్స్ అధికంగా ఉంటాయి. అవి సూక్ష్మ క్రిములను చంపుతాయి. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది.
క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే గుణాలు వైట్ టీలో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వైట్ టీని రోజూ తాగుతుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఆస్టియోపోరోసిస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఓ ఎముకల వ్యాధి. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి. అయితే వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ ఆస్టియోపోరోసిస్ సమస్యను తగ్గిస్తాయి. ఎముకలను బలంగా మారుస్తాయి.
వైట్ టీని తాగుతుండడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత (యూవీ) కిరణాల నుంచి చర్మం సంరక్షింపబడుతుంది. దీంతోపాటు వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. చర్మం మీద ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.