చింతకాయలను చూస్తేనే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. చింతకాయలు పచ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూరలు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. పచ్చి చింతకాయల పచ్చడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ ఏదైనా సరే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి వల్ల మనకు కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాధపడేవారు రాత్రి పూట చింత పండు తింటే మరుసటి రోజు ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది. అలాగే జీర్ణాశయంలో ఉండే అల్సర్లు మాయమవుతాయి. వాపులు తగ్గుతాయి.
చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా చూస్తుంది. అందువల్ల అధిక బరువు తగ్గుతారు.
చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో ఉండే హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీంతో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు చింతపండును నిత్యం తీసుకోవాలి. చింతపండులో యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. పేగుల్లో పురుగులు నాశనమవుతాయి. చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది కనుక వారికి చింతపండు ఇస్తే మంచిది.
కండరాలు, నాడుల పనితీరు సరిగ్గా ఉండాలంటే అందుకు బి విటమిన్ థయామిన్ ఉపయోగపడుతుంది. అది చింతపండులో పుష్కలంగా ఉంటుంది. కనుక చింత పండును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.