Aloe Vera Juice : పరగడుపున ఒక్క గ్లాస్ ఇది తాగితే.. బాన పొట్ట సైతం కరిగిపోవాల్సిందే..!

Aloe Vera Juice : మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. క‌ల‌బంద మొక్క అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగిన మొక్క‌. ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఉప‌యోగించి ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో కొవ్వును క‌రిగించే శ‌క్తి కూడా క‌ల‌బంద‌కు ఉంది. శ‌రీరంలో ఉన్న ఇన్ ఫెక్ష‌న్ ల‌ను కూడా క‌ల‌బంద నివారించ‌గ‌ల‌దు. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో క‌ల‌బంద మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

క్యాన్స‌ర్ ను నివారించే గుణం కూడా క‌ల‌బంద‌కు ఉంది. అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో ఎంతో వేధిస్తున్న అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డేయ‌డంలో కూడా క‌ల‌బంద ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి క‌ల‌బంద ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద‌ను ఏవిధంగా ఉప‌యోగించ‌డం వల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌గ‌ల‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

drink Aloe Vera Juice on empty stomach for these benefits
Aloe Vera Juice

దీనికోసం ముందుగా ఒక గ్లాస్ లో పాల‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక టీ స్పూన్ క‌ల‌బంద జ్యూస్ ను వేసి క‌ల‌పాలి. దీనిని రోజుకు రెండు పూట‌లా తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. అదే విధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద జ్యూస్ ను, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ తాగ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

బ‌రువు తగ్గ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ రేటును పెంచే త‌త్వం క‌ల‌బంద‌కు ఉంది. అలాగే క‌ల‌బ‌ద కార్బోహైడ్రేట్స్ ను శ‌క్తిగా మార్చ‌గ‌ల‌దు. క్ర‌మం త‌ప్ప‌కుండా ఒక నెల‌రోజుల పాటు ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts