నిద్ర సరిగా లేకపోవటం, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించండి. ఆరోగ్యమైన నిద్రకు…వేళకు పడుకోవటం – వేళకు లేవడమనేది ఒక చిట్కా. వివిధ సమయాలు నిద్రకు ఆచరించకండి. గాఢ నిద్ర పట్టదు. రాత్రివేళ నిద్ర సరిగా లేకుంటే పగటిపూట మీరు విశ్రాంతిగా వున్నపుడు 30 – 45 నిమిషాలపాటు నిద్రపోవచ్చు. రాత్రి వేళ డిన్నర్ అయిన కొద్ది గంటల తర్వాత నిద్రించడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమిస్తే జీర్ణవ్యవస్ధ బలహీనపడుతుంది. అలాగని ఖాళీ పొట్టతో కూడా నిద్రించవద్దు. నిద్రపోయే రెండు లేదా మూడు గంటల ముందుగా డిన్నర్ తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యేవి, ఆరోగ్యకరమైన ఆహారాలు డిన్నర్ లో తీసుకోండి.
గాఢ నిద్ర పోవాలంటే, నిద్రకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవాలి. టివి చూడటం, కంప్యూటర్ పై పని చేయటం వంటివి మాని గదిలో వెలుగును తగ్గించి కళ్ళకు స్వల్ప ఒత్తిడి కలిగిస్తే నిద్ర వస్తుంది. లేదా నిద్ర మూడ్ రావటానికి రిలాక్స్డ్ గా ఏదైనా మంచి పుస్తకం చదవండి. చాలామందికి అసౌకర్యమైన నిద్ర పుస్తకాల పఠనంతో సరిచేయబడింది. మంచి నిద్ర పట్టాలంటే ఇంటిలో ఎటువంటి ధ్వనులు లేకుండా చూడాలి. ధ్వనులు సరైన నిద్రను పట్టనివ్వవు. నిద్రించేముందు కొంత విశ్రాంతిగా వుండాలి. నిద్రించేముందు 5 నుండి 6 గంటల వ్యవధిలో కాఫీ, టీ వంటివి తాగరాదు. కేఫైన్ నిద్రాభంగం కలిగిస్తుంది. తాగితే 10 నుండి 12 గంటల పాటు నిద్ర రాకుండా కూడా చేస్తుంది.
నిద్రించేముందు, జ్యూసులు లేదా అధికంగా నీరు తాగవద్దు. ఇది మూత్రం చేయటానికి దోవతీసి నిద్రాభంగం కలిగిస్తుంది. నిద్రలేమి నుండి దూరంగా వుండాలంటే, నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోవద్దు. చాలామంది నిద్రించేందుకు ఆల్కహాల్ మంచిదనుకుంటారు. కాని, దీనితో మంచి నిద్ర లోపించటమే కాక, అతి తక్కువగానను వుంటుంది. నిద్రించేముందు సిగరెట్ తాగవద్దు. ఇందులోని నికోటిన్ నిద్రా సమస్యలను కలిగిస్తుంది. నిద్రించేముందు, కొద్ది సమయం యోగా ధ్యానం లేదా తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది కండరాలను విశ్రమింపజేసి శరీరాన్ని, మైండ్ ను నిద్రించేటందుకు అనువుగా తయారు చేస్తుంది. ఈ ఆరోగ్యకరమైన నిద్ర చిట్కాలు పాటించి మంచి నిద్ర పొండి. మీ నిద్ర లేమిని దూరం చేసుకోండి.