హెల్త్ టిప్స్

బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఒక గ్లాస్ నీళ్ల‌ను తాగండి.. ఎందుకంటే..?

సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం మరచిపోతారు. పని ఒత్తిడి కారణంగా.. లేదా ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల తీరిగ్గా భోజనం చేసే సమయం కూడా దొరకదు. ఇలాంటి సమయంలో ఆ సమయానికి అందుబాటులో ఉండే ఒకటి, అరా తిండ్లు తీసుకుని ఆకలిని చంపుకుంటారు. ఇలా చేయడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోక పోతే… ఒక వయస్సు దాటిన తర్వాత ఓవర్ వెయిట్‌ వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక బరువువున్నవారు ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం ఇష్టపడరు. మరికొందరైతే ఓవర్ వర్కవుట్స్ ప్రారంభిస్తారు. ఈ రెండింటి వల్ల లావు లేదా బరువు తగ్గడం అటుంచి.. నీరసం వచ్చి పడిపోవడం ఖాయమని వైద్యులు అంటున్నారు.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రతి మనిషి నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెపుతున్నారు. ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్ధాం. ప్రతి రోజు బ్రేక్ ఫాస్టులో బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోమంటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుందట. అలాగే, ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని, అందులో సగం తాజా కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇక మిగిలిన సగంలో ఒక పావు పప్పు దినుసులు, మరో పావు వంతు మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి.

drink one glass of water if you are hungry know why

కొన్నిసార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నామనుకుని తెగ తినేస్తాం. అందుకే మీరెప్పుడు ఆకలిగా అనిపించినా ముందు ఓ గ్లాస్ వాటర్ తాగండి. దీని తర్వాత భోజనం చేస్తే తక్కువగా తినే అవకాశం ఉంది. మరికొన్ని సమయాల్లో ఒక పూట ఆహారం తీసుకోక పోయినా.. బాగా ఆకలేస్తుంది. అలాంటపుడు ఆకలేస్తుంది కదా అని గబగబా తినేస్తాం. దీని వల్ల ఎంత తింటున్నామనేది తెలియదు. నెమ్మదిగా, బాగా నమిలి తినండి. అలాగే, రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీరు తాగాని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైమ్‌లో స్నాక్స్ తప్పనిసరి తీసుకోవాలి. తక్కువ కేలరీస్ ఉన్న బాదామ్ లాంటివి తీసుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా ఇంట్లో కాకుండా బయట ఆహారం తీసుకుంటే.. ముందు ఫ్రూట్ సలాడ్ కానీ, ఏదైనా సూప్‌గానీ తీసుకోండి. ఆ తర్వాతే భోజనం చేయండి. దీనివల్ల హై కేలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్, కేక్ లేదా స్వీట్ వంటివి దూరంగా ఉంచితే మంచిది.

Admin

Recent Posts