Blood Sugar Levels : నేటి తరుణంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో చక్కెర వ్యాధి కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారినపడుతున్నారు. చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం, థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోవడం వంటి వాటిని షుగర్ వ్యాధి రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారు కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. అలాగే వీరు జీవితాంతం మందులను మింగాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి కారణంగా మనం ఇతర అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే షుగర్ వ్యాధి కారణంగా చింతించాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టెట్రో కార్ఫస్ మాస్ప్రియం అనే అరుదైన చెట్టు బెరడు నుండి తయారు చేయబడిన టంబ్లర్ ను ఉపయోగించడం వల్ల మనం సులభంగా చక్కెర వ్యాధిని నియంత్రించుకుని నిపుణులు చెబుతున్నారు. ఈ టంబ్లర్ లో నీళ్లు నింపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల 90 శాతం వరకు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టంబ్లర్ లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చక్కెర వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారు ఈ నీటిని తాగడం వల్ల పూర్తిగా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఇలా టెట్రో కార్ఫస్ మాస్ప్రియం అనే చెట్టు నుండి తయారు చేసిన టంబ్లర్ లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటును, అధిక బరువును, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. టెట్రో కార్ఫస్ మాస్ప్రియం చెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్టు నుండి చేసిన టంబ్లర్ లో నీటిని నిల్వ చేయడం వల్ల చెట్టులోని ఆయుర్వేద గుణాలు నీటిలోకి విడుదల చేయబడతాయి.
ఈ చెట్టు బెరడును నీటిలో నానబెట్టినా లేదా ఆ బెరడుతో చెట్టు వాటిల్లో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు ఎర్రగా మారడమే కాకుండా రుచి కూడా మారుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఇలా నిల్వ చేసిన నీరు ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కనుక ఈ నీటిని తాగే వారు తరచూ షుగర్ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి.