Pillow Under Legs : సాధారణంగా మనలో కొందరు నిద్రించేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఈ క్రమంలో నిద్ర సరిగా లేకపోతే పలు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
ఇక గర్భిణీలను కూడా పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రించాలని వైద్యులు సూచిస్తుంటారు. దీనివల్ల గర్భం సమయంలో వచ్చే పాదాల వాపులు, నీరు పట్టడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. అలాగే రోజంతా ఎక్కువగా పని చేసేవారు ఇలా నిద్రించడం వల్ల సుఖవంతమైన నిద్ర సొంతమవుతుంది. ఇక కాళ్ల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తే కాళ్ళ వాపులు తగ్గుతాయి. అలాగే వెరికోస్ వెయిన్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఎక్కువగా పని చేసే వారికి వచ్చే వెన్ను నొప్పిని తగ్గించుకోవాలంటే.. పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రించాలి. ఇక కంప్యూటర్ మీద ఎక్కువ పని చేయటం వల్ల కొంతమందికి సయాటికా నొప్పి, డిస్క్ నొప్పి కూడా వస్తుంటాయి. ఈ నొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నా పాదాల కింద దిండు పెట్టుకొని పడుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి కాళ్ళ నొప్పులు, కాళ్లలో మంట తగ్గుతాయి. ఈ విధంగా పాదాల కింద దిండును పెట్టుకుని నిద్రించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.