Drumstick Leaves Powder : మునగకాయలు అంటే మనలో చాలా మందికి ఇష్టమే. వీటితో సాంబార్ లేదా కూరలు చేసుకుని తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కేవలం మునక్కాయలు మాత్రమే కాదు.. మనకు మునగాకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకును తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మునగాకును కొందరు నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ ఆకుల పొడి తినాలి. దీన్ని అన్నంలో రోజూ మొదటి ముద్దలో 1 టీస్పూన్ కలిపి తింటే చాలు.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకు పొడిని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు పొడిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, బి, సి, ఇ లతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలను దరిచేరనివ్వవు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావు. మునగాకు పొడిలో ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, ఆస్కార్బిక్ యాసిడ్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా క్యాన్సర్, హార్ట్ ఎటాక్‌లు రావు.
మునగాకు పొడిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఈ పొడిని రోజూ తింటే శరీరంలో వాపులు తగ్గుతాయి. ఇది కీళ్ల నొప్పులు, ఆస్తమా ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకు పొడిని భోజనంలో మొదటి ముద్దగా తింటే దాంతో షుగర్ లెవల్స్ అసలు పెరగవు. దీని వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం.
మునగాకు పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇలా మునగాకు పొడితో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ దీన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. క్రమంగా డోసు పెంచి రోజుకు 2 టీస్పూన్ల వరకు తీసుకోవచ్చు. కానీ వైద్య సలహా మేరకు వాడుకోవడం ఉత్తమం. అప్పుడే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.