Dry Coconut : మనం చేసే వంటలు చిక్కగా ఉండడానికి అలాగే తీపి పదార్థాల తయారీలో ఉపయోగించే వాటిల్లో ఎండుకొబ్బరి కూడా ఒకటి. ఎండుకొబ్బరిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొందరు దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండుకొబ్బరిని వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎండుకొబ్బరిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుకొబ్బరిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
స్త్రీ, పురుషులిద్దరిలో వచ్చే సంతానలేమి సమస్యలను నయం చేయడంలో కూడా ఎండుకొబ్బరి ఉపయోగపడుతుంది. రోజూ ఒక చిన్న ఎండుకొబ్బరి ముక్కను తినడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరగడంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఎండుకొబ్బరిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ ఎండు కొబ్బరిని పురుషులు రోజూ 38 గ్రాముల మోతాదులో, స్త్రీలు 25 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఎండుకొబ్బరిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాల బారిన కూడా పడకుండా ఉంటాం. ఎండు కొబ్బరిని తరచూ ఆహారంలో తీసుకోవవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది.
జ్ఞాపక శక్తిని పెంచడంతోపాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చేయడంలో కూడా ఎండుకొబ్బరి ఉపయోగపడుతుంది. ఎండుకొబ్బరిని వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి. ఎండుకొబ్బరితో తీపి పదార్థాలను చేసుకుని లేదా నేరుగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని, మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.