నోటిలో పెట్టుకున్న ఆహారం బాగా నమిలి తినటం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనం చేకూరుతుంది. సాధారణంగా ఆహారం తినేందుకు సమయం చాలామంది వెచ్చించరు. నమలకుండా వెంటనే తినేయడం వలన నష్టాలుంటాయి. మహాత్మ గాంధీ ఆహారం తినటంలో చాలా శ్రద్ధ వహించేవారు. మీ ద్రవాహారాలను నమలండి – ఘనాహారాలను తాగండి అనేవారు. నమిలి తింటే ప్రయోజనమని శాస్త్రీయంగా కూడా రుజువైంది. ఆహారం నమిలేందుకు కొన్ని చిట్కాలు చూడండి.
నోటిలో పెట్టిన ఆహారాన్ని నెమ్మదిగా, క్రమంగా గుజ్జులా చేయండి. మీరు ఆహారం తినే పరిసరాల వాతావరణం మిమ్మల్ని ఆందోళన కలిగించేదిగా కాకుండా విశ్రాంతినిచ్చేదిగా వుంచండి. అంటే తినేటపుడు మీరు టెలివిజన్ వద్ద కూర్చొనరాదు. చిన్న చిన్న ముద్దలు నోటిలో పెట్టుకోండి. చిన్న ముద్ద అయితే, నమలటం తేలిక, బాగా జరుగుతుంది.
నోరు నమలటం పూర్తయి పూర్తిగా ద్రవంగా మారిన తర్వాత నమలటం ఆపండి. నోటిలో పెట్టుకున్న ఆహారం పూర్తిగా నమలటం అయిన తర్వాత, ఆ ద్రవాన్ని మింగిన తర్వాత మాత్రమే మరో ముద్ద ఆహారం నోటిలో పెట్టుకోండి. నీరు లేదా ఇతర ద్రవాలు మీ నోరు ఖాళీగా వున్నపుడే తాగండి.