Cashew Nuts : జీడిపప్పును అధికంగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Cashew Nuts : సాధారణంగా ప్రతి ఒక్కరూ వివిధ రకాల వంటలను చేసేటప్పుడు ఎక్కువగా జీడిపప్పును ఉపయోగిస్తూ చేస్తుంటారు. ఇలా జీడిపప్పును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే జీడిపప్పులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే ఎన్నో పోషకాలు కలిగిన జీడిపప్పును రోజుకు కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

eating Cashew Nuts excessively is harmful to health know the limit

అధిక మొత్తంలో జీడిపప్పును తీసుకోవటంవల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఒక గుప్పెడు జీడిపప్పును నేరుగా తినడం వల్ల గుండె సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించి గుండె కండరాలను రిలాక్స్ చేస్తూ గుండెకు సంబంధించిన వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

అధిక ఆందోళన, పని ఒత్తిడి, డిప్రెషన్ లో ఉన్నవారు ప్రతి రోజూ జీడిపప్పును తినటం వల్ల ఆయా సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు.

జీడిపప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకల పటుత్వానికి దోహదపడతాయి. అదేవిధంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి జీడిపప్పు ఎంతో ఉపయోగపడుతుంది.

అధిక ప్రయోజనాలను అందిస్తుందని జీడిపప్పును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదుకు మించకుండా తినాలి.

Share
Sailaja N

Recent Posts