Foods : ప్రస్తుత కాలంలో చాలా మంది ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం ఆఫీస్ లకు, స్కూల్స్ కు వెళ్లాలనే తొందరతో ఏదో ఒకటి తినేస్తున్నారు. మనకు నచ్చిందని, అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. వాటిపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటిని తినేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన అనారోగ్య సమ్యలతో బాధపడుతున్నారు. అసలు మనం ఉదయం పూట ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏమిటి.. వాటిని ఎందుకు తినకూడదు..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోకూడని వాటిల్లో కాఫీ, టీ లు కూడా ఒకటి. చాలా మంది బెడ్ కాఫీ, టీ లను తాగేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎసిడిటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ, కాఫీ లు తాగే అలవాటు ఉన్న వారు ఆ అలవాటును సాధ్యమైనంత త్వరగా మానుకోవాలి. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్, సోడా వంటి చల్లటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో అల్సర్స్, వాంతులు అవ్వడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక కూల్ డ్రింక్స్ ను ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. వీటిని బదులుగా తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం ఉత్తమం.
అదే విధంగా ఖాళీకడుపుతో టమాటాలను తీసుకోకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో టమాటాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కారంగా ఉండే పదార్థాలను, మసాలా దట్టించి వండిన పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే పరగడుపున పెరుగును తీసుకోకూడదు. పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి దీనిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పరగడుపున అరటి పండ్లను తీసుకోకూడదు. అరటి పండులో ఉండే మెగ్నీషియం రక్తంపై చెడు ఫ్రభావాన్ని చూపిస్తాయి. దీంతో గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అదే విధంగా ఖాళీ కడుపుతో చిలగడ దుంపను కూడా తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో చిలగడ దుంపను తీసుకోవడం వల్ల ఎసిడిటీ వంటి జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే పరగడుపున జామకాయ, నారింజ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను కూడా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే పరగడుపున ఆల్కాహాల్ ను కూడా తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో ఉదయం పూట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం పూట ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం అనేక జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక వీటిని సాధ్యమైనంత వరకు ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.