Exercises For Diabetes : డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్నారా.. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను చేస్తే చాలు.. షుగ‌ర్ అమాంతం త‌గ్గుతుంది..!

Exercises For Diabetes : మ‌న‌లో చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఆహార నియ‌మాల‌ను పాటించాలి. స‌రైన ఆహారాన్ని తీసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఇలా ఆహార నియ‌మాల‌ను పాటించడంతో పాటు వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కూడా షుగ‌ర్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సివిటీ మెరుగుప‌డుతుంది.

రోజూ వాకింగ్, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాల‌ను చేయ‌డం వ‌ల్ల షుగర్ అదుపులో ఉండ‌డంతో పాటు బ‌రువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్, పుష్ అప్స్, బాడీ వెయిట్ వ‌ర్కౌట్స్, స్వ్కాట్స్ వంటి వ్యాయామాల‌ను చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల క‌ణ‌జాలం ఎక్కువ‌గా గ్లూకోజ్ ను వినియోగించుకుంటుంది. దీంతో క‌ణాలు గ్లూకోజ్ ను గ్ర‌హించ‌డంతో పాటు చురుకుగా వినియోగిస్తాయి. దీంతో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే విధంగా హై ఇన్టెన్సిటి ట్రావెల్ ట్రైనింగ్ వంటివి చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Exercises For Diabetes do them daily for better sugar levels control
Exercises For Diabetes

ప్ర‌భావ‌వంత‌మైన‌,శ‌క్తివంత‌మైన వ్యాయామాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుచుకోవ‌చ్చు. స‌మ‌యం తక్కువ‌గా ఉన్న వారు యోగా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. యోగా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. దీంతో మొత్తం శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. త‌గిన ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ మ‌న స‌మ‌యానికి త‌గిన‌ట్టు, మ‌న శ‌రీరానికి త‌గిన‌ట్టు త‌గిన వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts