Eye Liner Health Benefits : ఈరోజుల్లో ఎక్కువ మంది, స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మొదలు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. మనం అందంగా కనపడాలంటే, కళ్ళు కూడా బాగుండాలి. కళ్ళు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. కళ్ళకి కాటుక పెట్టుకుంటే, దుమ్ము, ధూళి కూడా కంట్లోకి వెళ్ళదు. సూర్యకిరణాలు కంటి మీద పడితే, ఎంత ప్రమాదమో మనకి తెలుసు. సూర్యకిరణాలు కంటిమీద పడకుండా, కాటుక మనల్ని కాపాడుతుంది. కాటుక కళ్ళకి చల్లదనాన్ని కూడా ఇస్తుంది.
కాటుక పెట్టడం వలన కేవలం అందమే కాదు. కంటికి రక్షణ కూడా కలుగుతుంది. కాటుక పెట్టుకోవడం వలన, కళ్ళకి చల్లదనం అందుతుంది. అలానే, కళ్ళు మెరసేటట్టు చేస్తుంది. కళ్ళు ఏ ఆకారంలో వున్నా, కాటుక పెట్టగానే ఆకర్షణయంగా కనబడతారు. అందాన్ని రెట్టింపు చేసుకో వచ్చు. కాటుక నిద్ర పట్టడానికి కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఈరోజుల్లో కెమికల్స్ లేని కాటుకలు కూడా మనకి దొరుకుతున్నాయి.
మార్కెట్లో అటువంటి వాటిని, మనం ఈజీగా కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఏ కెమికల్స్ లేకుండా, మనం ఇంట్లో ఈజీగా కాటుకని తయారు చేసుకోవచ్చు కూడా. కెమికల్స్ ఉండే కాటుక పెట్టుకుంటే దురద, మంట వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి, కెమికల్స్ లేని వాటిని మాత్రమే ఉపయోగించడం మంచిది.
ముఖం మీద, కళ్ళ మీద ఏమాత్రం తడి లేకుండా తుడుచుకుని, తర్వాత కాటుక పెట్టుకోండి. కాటుక పెట్టుకోవడం వలన శరీరంలో వేడి తగ్గి, చలువ చేస్తుంది అని ఆయుర్వేదం చెప్తోంది. అమ్మాయిలూ చూశారు కదా కాటుక పెట్టుకోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కచ్చితంగా ఈసారి కాటుకని పెట్టుకోండి. అప్పుడు ఇన్ని లాభాలని మనం పొందడానికి అవుతుంది.