కొందరు కొన్ని పోషకాల కోసం లేదా హైబీపీ వంటి వ్యాధుల్లో చికిత్స కోసం చేప నూనెతో తయారు చేసిన కాప్స్యూల్స్ వంటివి వాడుతుంటారు. ఇది చేప నూనె నుంచి తయారు చేసిన పోషకాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఔషధాలు. కానీ ఇలా ప్రత్యామ్నాయంగా చేప నూనె కాప్స్యూల్స్ కంటే వాస్తవంగా చేపలే తినడం మంచిదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనరీ హార్ట్ డిసీజ్ (గుండెజబ్బు) ఉన్న కొందరికి ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ప్రతి రోజూ చేపలతో భోజనం పెట్టడం చేశారు. అదే సమయంలో అదే జబ్బుతో బాధపడుతున్న మరికొందరికి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ ఉన్న చేపనూనెతో తయారైన మాత్రలు ఇచ్చారు.
నిర్ణీత కాలం తర్వాత ఆ రెండు గ్రూపులనూ పరిశీలిస్తే చేపనూనె మాత్రలు వాడిన వారికంటే తాజా చేపలతో వండిన ఆహారం తిన్నవారిలోనే రక్తపోటు బాగా అదుపులో ఉందని తేలింది. దీన్ని బట్టి చేపనూనె సప్లిమెంట్ల కంటే తాజా చేపలే మంచివని తేలింది కదా! సో.. వారానికి రెండు సార్లు తాజా చేపలు ఆహారంలోకి తీసుకోండి.