హెల్త్ టిప్స్

ఈ 25 సింపుల్ టిప్స్ పాటించండి….డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు&period; నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు&period; ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది&period; అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు&period; వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు&period; ఆయా సమయాల్లో మనం చేసే పనులు&comma; తీసుకునే ఆహారం&comma; నిద్ర తదితర రోజువారీ అంశాలపై కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు&period; ఎంచక్కా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు&period; అదెలాగో ఇప్పుడు చూద్దాం&period; రోజుకు కనీసం 7&period;50 కిలోమీటర్లు &lpar;దాదాపు 10వేల స్టెప్స్&rpar; నడిస్తే చాలు&period; ఇందు కోసం అవసరమైతే స్మార్ట్‌ఫోన్&comma; ఫిట్‌నెస్ బ్యాండ్ వంటి అధునాతన సాంకేతిక పరికరాల సహాయం తీసుకోవచ్చు&period; ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో మార్పు వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనలో అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉంటారు&period; అయితే ఎక్కువ సేపు కూర్చుని ఉన్నా&comma; కొద్దిగా విరామం దొరికితే ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నించండి&period; ఇలా చేస్తే ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను దూరం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది&period; నడిచినా&comma; నిలబడ్డా ఒకే రకమైన శరీర భంగిమ వచ్చేలా చూసుకోండి&period; అదెలాగంటే పొట్ట లోపలికి&comma; ఛాతి బయటికి ఉంటూ&comma; భుజాలు వెనక్కి ఉండేలా&comma; మెడ సరిగ్గా ఉండేలా భంగిమను అలవాటు చేసుకోండి&period; ఇది శరీరంలోని కొన్ని క్యాలరీలను కరిగించేందుకు ఉపయోగపడుతుందట&period; చక్కని భంగిమతోపాటు శ్వాస కూడా సరిగ్గా పీల్చాలి&period; ఇది రొమ్ము కదలికలను మెరుగు పరుస్తుంది&period; దీంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగా అంది ఒత్తిడి నుంచి దూరం కావచ్చు&period; ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి కొత్త శక్తి చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71253 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;walking&period;jpg" alt&equals;"follow these 25 health tips for better health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన పేర్కొన్న కేవలం నాలుగు సూత్రాలను నిత్యం పాటిస్తే వారానికి అరకిలో నుంచి కిలో వరకు బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందంటే నమ్మగలరా&quest; కానీ ఇది నిజం&period; పైన తెలిపిన వాకింగ్‌తోపాటు వీలైతే వ్యాయామం&comma; యోగా&comma; వెయిట్ ట్రెయినింగ్ వంటివి రోజులో కొంత సమయం పాటు చేయవచ్చు&period; ఇది శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగిస్తుంది&period; వారంలో ఒక రోజు ఉపవాసం ఉండండి&period; అయితే ఉపవాసం ఉండలేమనుకునే వారు తేలిగ్గా అరిగే ఆహారాన్ని కేవలం కొద్ది మొత్తంలో తీసుకునేందుకు ప్రయత్నం చేయండి&period; ఖాళీ కడుపుతో&comma; ఆకలిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు కొనేందుకు వెళ్లవద్దు&period; ఎందుకంటే అది మీ చేత అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ కొనిపించేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంక్‌ఫుడ్&comma; మసాలా ఆహారం&comma; చక్కెరతో చేసిన పదార్థాలు&comma; ఆయిల్ ఫుడ్ వంటి వాటిని వంటగదిలో నుంచి వీలైనంత వరకు తొలగించేందుకు ప్రయత్నం చేయండి&period; ఎందుకంటే అవి మీకు ఎక్కువ క్యాలరీలను ఇస్తాయి&period; మళ్లీ వాటిని కరిగించాలంటే ఇంకా ఎక్కువ కష్ట పడాల్సి వస్తుంది&period; వాటికి బదులుగా బాదం పప్పు&comma; వాల్‌నట్స్&comma; పండ్లు&comma; ఖర్జూరం వంటి వాటిని వంటగదిలో చేర్చండి&period; కొద్దిగా ఆకలిగా అనిపించినప్పుడు వీటిని కొంత మొత్తంలో తిన్నా అధిక క్యాలరీలు చేరవు&period; దీంతో ఆకలి కూడా వేయదు&period; ఎంత తిన్నా ఇంకా ఆకలిగానే ఉంటే మళ్లీ ఆహారం తినకుండా దానికి బదులుగా నీరు లేదా గ్రీన్ టీ తాగండి&period; తరచూ ఇలా చేస్తే శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవు&period; ఇది బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71254" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fish-fry&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలను వారంలో కనీసం 3 సార్లయినా తినాలి&period; దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి&period; ఆహారాన్ని అధిక మంటపై ఎక్కువ సేపు ఉడికించకూడదట&period; ఇలా చేస్తే అందులోని పోషకాలన్నీ ఆవిరైపోతాయి&period; ఎల్లప్పుడూ తక్కువ మంటపైనే ఆహారం వండాలి&period; చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను వీలైనంత వరకు తగ్గించండి&period; కూల్‌డ్రింక్స్&comma; కేక్‌లు&comma; బిస్కెట్లు&comma; స్వీట్లు&comma; ఐస్‌క్రీమ్స్ వంటి వాటిని ఎంత వీలైతే అంత తక్కువగా తినాలి&period; ఉదాహరణకు ఒక పెద్ద కేక్ ముక్క తినాల్సి వస్తే అందులో 3 వంతు మాత్రమే తినండి&period; పెద్ద కప్పులో కాఫీ తాగాల్సి వస్తే అందులో సగం తగ్గించి తాగండి&period; ఇలా క్రమంగా చేస్తూ పోతే చక్కెరకు మీరే దూరమవుతారు&period; కొబ్బరినూనె&comma; అవకాడోలు&comma; దేశీ నెయ్యి&comma; కోడిగుడ్లు&comma; పాలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి&period; వీటి వల్ల ఆరోగ్యానికి హాని ఏమాత్రం కలగదు&period; అలా చెప్పేవన్నీ అపోహలే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట భోజనానికి&comma; అనంతరం నిద్రకు మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి&period; దీంతో శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థాయికి వస్తాయి&period; రాత్రి పూట తిన్న వెంటనే నిద్రిస్తే బ్లడ్ షుగర్ పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్‌కు దారి తీస్తుంది&period; శరీర బరువును బట్టి నిత్యం 1&period;4 గ్రా నుంచి 2 గ్రా&period; వరకు ప్రోటీన్‌లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి&period; ఇది శరీరంలోని క్యాలరీలను కరిగించేందుకు&comma; కొత్త కణజాలం ఏర్పడేందుకు ఉపయోగపడుతుంది&period; మధ్యాహ్నం&comma; రాత్రి సమయాల్లో భోజనానికి ముందు కొద్దిగా పచ్చి కూరగాయలను తినండి&period; దీంతో కడుపు నిండిన భావన కలిగి ఆటోమేటిక్‌గా మీరు తక్కువ భోజనం చేస్తారు&period; ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71255" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;water-drinking&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా 1 లీటర్ నీటిని తాగాలి&period; ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది&period; ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ&comma; కాఫీ వంటివి తాగకూడదు&period; ఎందుకంటే రాత్రి నుంచి ఉదయం వరకు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు కడుపు ఖాళీగా ఉంటుంది&period; ఆ సమయంలో కాఫీ&comma; టీలు తాగితే వాటిలోని యాసిడ్లు పొట్టలోని లైనింగ్ &lpar;మ్యూకస్ పొర&rpar;ను దెబ్బతీస్తాయి&period; నీరు లేదా గ్రీన్ టీ వంటివి తాగిన తరువాతే కాఫీ&comma; టీలు తాగడం ఉత్తమం&period; మనలో అధిక శాతం మంది పొట్ట నిండినా&comma; నిండకపోయినా అధికంగా తిండి తింటారు&period; అయితే ఇలా తినడం ప్రమాదకరం&period; ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు దీన్ని అస్సలు పాటించకూడదు&period; అయితే కడపు నిండిన భావన కలిగేందుకు కొద్దిగా ముందుగానే భోజనం ముగించడం ఉత్తమమైన పద్ధతి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న సైజ్‌లో ఉన్న ప్లేట్లలో ఆహారం తినండి&period; ఎందుకంటే ఆ సైజ్‌లో ప్లేట్ ఉంటే వాటిలో కొద్దిగా ఆహారం ఉంచినా ఎక్కువ తింటున్నామేమోనన్న భావన కలుగుతుంది&period; దీంతో ఆటోమేటిక్‌గా భోజనం తగ్గించేస్తారు&period; పలువురు పరిశోధకులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా ధృవీకరించారు కూడా&period; ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఇతరుల పట్ల జాలి&comma; దయ కలిగి ఉండండి&period; ఇలా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడుతుందట&period; పలువురు సైంటిస్టులు ఈ విషయంపై పరిశోధనలు కూడా చేశారు&period; వీలు కలిగిన వారు శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి&period; ఇది శరీరంలోని రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది&period; నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71256" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sleep&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రించే సమయంలో గదిలో వీలైనంత వరకు చీకటిగా ఉండేలా చూసుకోవాలి&period; దీంతో చక్కని నిద్ర పడుతుంది&period; వీలైతే ఐ మాస్క్‌లు ధరించవచ్చు&period; రోజులో కనీసం 20 నిమిషాల పాటైనా మన శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి&period; ఇలా చేస్తే ఆ రోజుకి కావల్సిన à°¡à°¿ విటమిన్ మనకు అందుతుంది&period; విటమిన్ à°¡à°¿ వల్ల మన ఎముకలు దృఢంగా మారడమే కాదు&comma; దాదాపు 3వేల రకాల కణాలకు శక్తి అందుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts