Food For Kids : చిన్నారులకు రోజూ ఈ విధంగా ఆహారాలను తినిపిస్తే.. శక్తివంతులు అవుతారు, వ్యాధులు రావు..!

Food For Kids : చిన్నారులకు రోజూ అన్ని పోషకాలతో కూడిన ఆహారాలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. అన్ని రకాల పోషకాలు లభిస్తాయి కనుక శక్తితోపాటు పోషణ కూడా లభిస్తుంది. అయితే చిన్నారులకు రోజూ ఎలాంటి ఆహారాలను తినిపించాలా ? అని తల్లులు ఆలోచిస్తుంటారు. కానీ కింద తెలిపిన విధంగా ఆహారాలను పెడితే చాలు, పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. దీంతో వారికి అన్ని పోషకాలను అందించవచ్చు.

Food For Kids give these daily to them for energy and nutrition

ఉదయం పిల్లలకు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కున్నాక ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలను ఇవ్వాలి. రెండు బాదం పప్పులను పెట్టాలి. ఆ పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి పొట్టు తీసి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, ఎగ్‌ దోశ వంటివి పెట్టాలి. జీడిపప్పు వేసి చేసిన ఉప్మాను కూడా పెట్టవచ్చు.

ఉదయం 11 గంటలకు.. అంటే అల్పాహారానికి, లంచ్‌కి మధ్యలో ఒక అరటి పండు పెట్టాలి. లేదా వేరే ఇతర ఏ పండునైనా పెట్టవచ్చు.

మధ్యాహ్నం భోజనంలో నెయ్యి వేసి కలిపిన పప్పు అన్నం, పెరుగు అన్నం పెట్టాలి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నువ్వులతో చేసిన లడ్డూ ఒకటి లేదా పల్లి పట్టీ ఒకటి ఇవ్వాలి. ఇవి ఎంతో బలాన్నిస్తాయి.

సాయంత్రం 5 గంటలకు మళ్లీ ఏదైనా పండు ఇవ్వాలి. రాత్రి 7 గంటలకు రాజ్మా లేదా కూరగాయలతో చేసిన కూరతో ఒకటి, రెండు చపాతీలను పెట్టాలి. రాత్రి నిద్రకు ముందు మళ్లీ ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలను తాగించాలి. 2 ఖర్జూరం పండ్లను తినిపించాలి.

ఈ విధంగా చిన్నారులకు రోజూ ఆహారం ఇవ్వవచ్చు. మాంసాహారం ఇవ్వదలిస్తే బాగా మెత్తగా ఉడికించి పెట్టాలి. ఉడకబెట్టిన కోడిగుడ్డును ఉదయం లేదా మధ్యాహ్నం ఇస్తే మంచిది.

Admin

Recent Posts