Foods For High BP : రోజూ వీటిని తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగిపోతుంది..!

Foods For High BP : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక ర‌క్తపోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. చాప కింద నీరులా ఈ స‌మ‌స్య శ‌రీరం మొత్తాన్ని గుల్ల‌బారేలా చేస్తుంది. అధిక ర‌క్త‌పోటు వ‌ల్ల ప్రాణాల‌కు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె క‌వాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. క‌నుక బీపీని ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందుల‌ను వాడ‌డంతో పాటు కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బీపీని చాలా సుల‌భంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు.

బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ప‌ల్లీలను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. ప‌ల్లీలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, కార్బోహైడ్రేట్స్ పుష్క‌లంగా ఉంటాయి. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తొల‌గిపోతుంది. అంతేకాకుండా ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్తపోటు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది.

Foods For High BP very effective take them daily
Foods For High BP

అలాగే బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా అధిక ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక ర‌క్తపోటును నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. శరీరం బ‌లంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. క‌నుక రోజూ 4 లేదా 5 బాదంప‌ప్పుల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున పొట్టు తీసి తినాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. అలాగే అధిక ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో జీడిప‌ప్పు కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. చాలా మంది జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని భావిస్తారు. కానీ జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శరీర బ‌రువు అదుపులో ఉంటుంది.

జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు త‌గ్గ‌డంతో పాటు షుగ‌ర్ అదుపులో ఉంటుంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా దాదాపు విట‌మిన్ ఎ, బి1, బి6, ఇ ల‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. అలాగే ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. కంటినిండా నిద్రపోవాలి. ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. ఈ ఆహారాల‌ను తీసుకుంటూ ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts