Foods For Lungs : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఇవి మన శరీరంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటే మన శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మనం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాము. కనుక మనం వీలైనంత వరకు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా శ్రద్ద వహించాలి. వీటిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడంతో పాటు ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి. వీటితో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరియు వాటిని శుభ్రపరిచే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఎల్లప్పుడూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీ, కాలీప్లవర్, బ్రస్సెల్స్, కాలే వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సల్పర్ కూడా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచడంతో పాటు వాపును కూడా తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అల్లం మనకు ఎంతో సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఊపిరితిత్తులను కూడా శుభ్రంగా ఉంచుతాయి. ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ తో పాటు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు వాటిని శుభ్రపరచడంలో దోహదపడతాయి. ఇక శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో గ్రీన్ టీ మనకు ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెరీ వంటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటాయి. ఇక విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా ప్యూనికాలాజిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉండే దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఊపిరితిత్తుల్లో ఉండే విష పదార్థాలను తొలగించడంలో ఆకుకూరలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఇక ఊపిరితిత్తులకు ఇన్పెక్షన్ ల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ తో పాటు యాంటీ మైక్రో బయాల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని వాటి పనితీరును మెరుగుపరుచుకోవచ్చు మరియు ఎల్లప్పుడూ వాటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు.