Foods For Thyroid : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, మలబద్దకం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, తల తిరిగినట్టుగా ఉండడం, నిద్రలేమి, శరీరం వేడిగా అనిపించడం, దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, స్త్రీలల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, హార్మోన్ల అసమతుల్యతలు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా థైరాయిడ్ కారణంగా తలెత్తూ ఉంటాయి.
అలాగే థైరాయిడ్ కు సంబంధించిన మందులను వాడడం వల్ల కూడా మనం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మనం థైరాయిడ్ కు సంబంధించిన మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ తో బాధపడే వారు శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. అలాగే శరీరమంతా కదిలేలా వ్యాయామం చేయాలి. అదే విధంగా ఆహారంలో నువ్వులు, కొబ్బరి, పల్లీలు, బెల్లం వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నువ్వుల నుండి నూనె తీయగా వచ్చిన తెలగ పిండిని ఆహారంగా తీసుకోవాలి. అదే విధంగా వీలైనంత వరకు సముద్రపు ఉప్పును ఆహారంగా తీసుకోవాలి. అదే విధంగా గుమ్మడికాయను, గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ చాలా త్వరగా నియంత్రణలోకి వస్తుంది.
అలాగే బొప్పాయి పండును కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పెసరపప్పు, బియ్యం, బెల్లం తో కిచిడీని తయారు చేసుకుని తినాలి. బెల్లం, జీలకర్ర పొడి కలిపి తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య నియంత్రణలోకి వస్తుంది. వీటితో పాటు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. సూర్యోదయ సమయంలో వచ్చే ఎండలో కూర్చోవడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా త్వరగా అదుపులోకి వస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల థైరాయిడ్ సమస్యకు వాడే మందుల మోతాదు తగ్గుతుంది. దీంతో మనం మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన అధికంగా పడకుండా ఉంటాము.