చాలా మందికి శరీరంలో అనేక భాగాల్లో నొప్పులు వస్తుంటాయి. దీంతోపాటు వాపులు కూడా ఉంటాయి. అయితే ఇలా జరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఈ సమస్యలు ఉన్నవారు కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో వాటి నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ నూనెలో శక్తివంతమైన యాంట ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చుకుంటే నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
* టమాటాల్లో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల టమాటాలను రోజూ తింటే నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు.
* మిరపకాయల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు.
* పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే సమస్యలను తగ్గించుకోవచ్చు.
* నొప్పులు, వాపులను తగ్గించడంలో గ్రీన్ టీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
* ద్రాక్షల్లో రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. అది మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. వాపులను తగ్గిస్తుంది. ద్రాక్షలను రోజూ తింటున్నా నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు.